Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్యంత క్లిష్టమైన సమయంలో రోగి ప్రాణాలు కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు

Heart
, సోమవారం, 19 జూన్ 2023 (22:00 IST)
గత 15 ఏండ్లుగా దీర్ఘకాలిక వ్యాధులతో పాటు కార్డియాలజీ సమస్యలతో బాధపడుతున్న రోగికి సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు ప్రాణం పోశారు. రోగి చివరి దశకు చేరుకుని ఇక బ్రతకడం కష్టమన్న తరుణంలో 'గోల్డెన్ అవర్లో సిటిజెన్ వైద్యులు అత్యంత క్లిష్టమైన చికిత్సచేసి రోగి ప్రాణాలు రక్షించారు. ఐదు రోజులపాటు చేసిన ఎక్మో చికిత్సతో రోగి సాధారణ స్థితికి చేరుకోవడం అందరిని ఆశ్చర్య పర్చింది.
 
వెంకటేష్ (పేరు మార్చారు) అనే 35 ఏళ్ల వ్యక్తికి ఉదయం 5:30 గంటల సమయంలో ఓ గంటపాట తీవ్రమైన నొప్పి వచ్చింది. రోగి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో అప్రమత్తమైన బాధితుని కుటుంబ సభ్యులు, వెంటనే నగరంలోని సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. రోగి పరిస్థితిని గమనించిన సిటిజన్స్ స్పెషాలిటీ  వైద్యులు డాక్టర్ నిఖిల్ భార్గవ్, డాక్టర్ ప్రియాంకా గుంటూర్ వెంటనే ఎమర్జెనీ బృందాలను అప్రమత్తం చేశారు. కార్డియాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ సుధీర్ కోగంటీ రోగికి అత్యవసర చికిత్సను అందించారు. ఆ తర్వాత రోగి రక్తప్రసరణలో లోపాలు గుర్తించిన వైద్యులు ఎంఐసీయూకి తరలించారు. రోగి క్రిటికల్ కండీషన్లో ఉండటంతో వైద్య బృందాలు అనుక్షణం పర్యవేక్షించాయి. రోగి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో రోగి బంధువులు, కుటుంబం ఆందోళనకు గురయ్యారు. వారికి ధైర్యం చెప్పిన కన్సల్టెంట్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కోగంటి మెరుగైన చికిత్స అందించారు. రోగికి ECMO చికిత్సను అందించారు. అత్యంత క్లిష్టమైన సమయంలో రోగి ప్రాణాలు కాపాడగలిగామని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 
 
సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిటికల్ కేర్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ పాలెపు బి గోపాల్ మాట్లాడుతూ, తమ బృందాల యొక్క ప్రయత్నం  అభినందిస్తున్నానన్నారు. వెంకటేష్ ప్రస్తుతం ఇంట్లోనే ఉండి సాధారణ జీవితాన్ని గడుపుతున్నప్పటికీ కఠినమైన జీవనశైలిని అనుసరించి, షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ప్రాంతీయ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ ప్రభాకర్ పి మాట్లాడుతూ, "గుండెపోటు ప్రారంభమైన తర్వాత మొదటి 60 నిమిషాలు "గోల్డెన్ అవర్". కాబట్టి, మొదటి గంటలోపు తగిన చికిత్సతో దాని ప్రభావాలను తిప్పికొట్టవచ్చు లేదా తదుపరి చికిత్స కోసం పరిస్థితిని మెరుగు పరచవచ్చు. సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ దాని కార్డియాలజీ, క్రిటికల్ కేర్, ఎమర్జెన్సీ టీమ్ యొక్క విజయాల పట్ల సంతోషంగా వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిచిడి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?