Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌లో ఋతుక్రమ ఆరోగ్యంపై సంభాషణలను ప్రారంభించిన ఉజాస్ మెన్‌స్ట్రువల్ హెల్త్ ఎక్స్‌ప్రెస్

Ujaas Menstrual Health Express

ఐవీఆర్

, శనివారం, 3 ఫిబ్రవరి 2024 (19:00 IST)
శ్రీమతి అద్వైతేషా బిర్లా నేతృత్వంలో, ఆదిత్య బిర్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్ మద్దతుతో ప్రారంభించిన ఒక సంచలనాత్మక కార్యక్రమం, ఉజాస్ మెన్‌స్ట్రువల్ హెల్త్ ఎక్స్‌ప్రెస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాని పరివర్తనాత్మక కార్యక్రమాలను ప్రారంభించింది. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో చెరగని ముద్ర వేసిన ఈ విశిష్ట కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో ఋతుక్రమ ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం ద్వారా సరికొత్త మార్పును తెస్తుంది.
 
ఈ కార్యక్రమం ఇప్పటికే హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, విశాఖపట్నం, జ్ఞానపురం, దుర్గాపురం, ఆరిలోవ, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాలలో శక్తివంతమైన అవగాహన వర్క్‌షాప్‌లను నిర్వహించటంతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లో ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్‌లను పంపిణీ చేసింది. ఈ ప్రచారం ద్వారా యుజాస్ యుక్తవయస్సులో ఉన్న బాలికలు, మహిళలకు సాధికారత కల్పించడంపై దృష్టి సారించి, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, స్థానిక కమ్యూనిటీలకు చురుకుగా చేరుతోంది. ఉజాస్ యొక్క ఎన్జిఓ భాగస్వాములు దివ్య దిశ, నిర్మాణ్ ఆర్గనైజేషన్ ద్వారా స్థానిక ఔట్రీచ్ సమర్ధవంతంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాలలో భాగంగా ఉజాస్ రాష్ట్రంలో ఋతుక్రమం చుట్టూ ఉన్న విభిన్న సంస్కృతులు, పద్ధతులు, నమ్మకాల గురించి క్లిష్టమైన డేటాను సేకరిస్తుంది. 
 
ఋతుస్రావం చుట్టూ ఉన్న అపోహలను తొలగించడానికి, ఉజాస్ ఋతు ఆరోగ్యం, పరిశుభ్రత గురించి దేశవ్యాప్తంగా అవగాహన పెంపొందించాలనే లక్ష్యం పట్ల స్థిరంగా ఉంది. 'ఉజాస్ మెన్‌స్ట్రువల్ హెల్త్ ఎక్స్‌ప్రెస్' భారతదేశంలో 25 రాష్ట్రాలు, 107 నగరాలలోని 25,0000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాన్ని చేరుకోవాలనే లక్ష్యం కలిగి ఉంది. కేవలం వాహనంగా మాత్రమే కాకుండా, ప్రత్యేకంగా రూపొందించిన ఈ వ్యాన్ మార్పును సూచిస్తుంది, అడ్డంకులను ఛేదిస్తుంది. 
 
ఉజాస్ వ్యవస్థాపకులు శ్రీమతి అద్వైతేషా బిర్లా మాట్లాడుతూ, "ఆంధ్రప్రదేశ్‌లో ఈ వ్యాన్ ప్రయాణిస్తున్నప్పుడు, స్థానిక సమాజంతో కనెక్ట్ అవ్వడం, మూస పద్ధతులను సవాలు చేయడం, విజ్ఞానం, అవగాహన ఉన్న సమాజాన్ని పెంపొందించే మా లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడం పట్ల మేము ఆసక్తిగా ఉన్నాము. మా లక్ష్యం సమాజం దృష్టికోణం మార్చటం, ఋతు ఆరోగ్యం కోసం చేసే ప్రచారాన్ని విప్లవాత్మకంగా మార్చటం. ఉజాస్ మెన్స్ట్రువల్ హెల్త్ ఎక్స్‌ప్రెస్ సాధికారత, మార్పుకు చిహ్నం" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తులసితో 8 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?