Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్తరాదిన 'పోహ'... దక్షిణాదిన 'అటుకుల పులిహోర'.. తింటే...?

ప్రపంచంలో మొదటి ఫాస్ట్‌ఫుడ్‌గా అటుకుల‌ను తినేవార‌ట‌. రకరకాల కూరగాయల, పల్లీలతో కలిపి ఉప్మా, పులిహోర, పాయసం ఇలా ఎన్నో చిటికెలో చేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకుని, కాస్త బెల్లం ముక్క పెట్టుకుని తినడం మనకు ప్రాచీన కాలం నుంచి అలవాటుగా ఉంది. కానీ అటుకుల్

ఉత్తరాదిన 'పోహ'... దక్షిణాదిన 'అటుకుల పులిహోర'.. తింటే...?
, గురువారం, 14 జులై 2016 (14:32 IST)
ప్రపంచంలో మొదటి ఫాస్ట్‌ఫుడ్‌గా అటుకుల‌ను తినేవార‌ట‌. రకరకాల కూరగాయల, పల్లీలతో కలిపి ఉప్మా, పులిహోర, పాయసం ఇలా ఎన్నో చిటికెలో చేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకుని, కాస్త బెల్లం ముక్క పెట్టుకుని తినడం మనకు ప్రాచీన కాలం నుంచి అలవాటుగా ఉంది. కానీ అటుకుల్ని పోషకాహారంగా గాక ఏదో చిరుతిండిలో భాగంగా భావిస్తుంటాము. కానీ ఏ రకం ధాన్యంతో చేసిన అటుకుల్లో అయినా పిండిపదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి.

ఖనిజాలు, విటమిన్లు, ప్రొటీన్లు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. చిప్స్, బిస్కట్లతో పోలిస్తే ఇది మంచి స్నాక్‌ఫుడ్. ఉదాహరణకు వరి అటుకుల్నే తీసుకుంటే వీటిని రోజూ తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తకుండా ఉంటుంది. 100 గ్రా. వరి అటుకుల్లో 20 మి.గ్రా. ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకి,గర్భిణులకి, పాలిచ్చే తల్లులకి ఇది మంచి ఆహారంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.
 
*  అటుకుల్లో పీచు ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలోకి పిండిపదార్థాలు కొంచెంకొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటిస్ రోగులకు ఇవి మంచివే. ఆకలేసినప్పుడు గుప్పెడు అటుకులు తింటే పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది.
* గోధుమ అటుకుల్లో ఐరన్, పీచుతోపాటు కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది.బీ ఓట్స్‌మీల్ లేదా ఫ్లేక్స్‌ని అల్పాహారంగా తీసుకోవడంవల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.
* అటుకుల్లోని ఫైటో కెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తాయి.
* పిండిపదార్థాలు, ఐరన్, బి- కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండే కార్న్‌ఫ్లేక్స్ అందరికీ మంచిగా ఉప‌మోగ‌ప‌డ‌తాయి.
* అన్ని రకాల ధాన్యాల్లోని పోషకాలు కావాలనుకుంటే నాలుగైదు రకాల ఫ్లేక్స్‌ని పాలల్లో వేసుకుని, వాటికి ఎండుద్రాక్ష, బాదం, మరేమైనా పండ్లు కూడా కలిపి తీసుకోవచ్చు.ఇవి పిల్లలకు ఎంతో శక్తిని ఇస్తాయి.
* అటుకులు ప్రొబయోటిక్ ఆహారం కూడా. ధాన్యాన్ని నానబెట్టి, వడేసి మిల్లు పడతారు. తరువాత ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండబెడతారు. ఇలా చేయడంవల్ల అవి పులిసినట్లుగా అవుతాయి. ఆ సమయంలో వాటిల్లో ప్రొబయోటిక్ బ్యాక్టీరియా చేరుతుంది. వీటిల్లో ఉండే ఈ బ్యాక్టీరియా కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వీటిని నీళ్లలో నానబెట్టుకుని మరీ తాగుతారు. గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదా ఇతరత్రా ఏ కారణంతో అయినా పొట్ట అప్‌సెట్ అయినా అటుకుల టానిక్ ఔషధంలా పనిచేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆహారం తినేటప్పుడు నీరు త్రాగడం మంచిదా? కాదా?