Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లలు పుట్టలేదంటారు కానీ... అసలు ఇవి తింటున్నారో లేదో?

పిల్లలు పుట్టలేదంటారు కానీ... అసలు ఇవి తింటున్నారో లేదో?
, గురువారం, 11 అక్టోబరు 2018 (17:33 IST)
ప్రస్తుతకాలంలో దంపతులు ఎదుర్కొంటున్న సమస్య సంతానలేమి. ఈ సమస్యతో చాలామంది దంపతులు సతమతమవుతున్నారు. సంతానం కలుగకపోవడానికి భార్యాభర్తల ఇద్దరిలో ఎవరో ఒకరు కారణం కావచ్చు. వివాహం అయిన రెండు సంవత్సరాలు లోపు స్త్రీ గర్భం దాల్చకపోయినట్లయితే సంతాన నిపుణులను సంప్రదించడం చాలా అవసరం. అంటే భార్యాభర్తలిద్దరిలో లైంగిక పరమైన సమస్యలు లేకుండా ఉన్నప్పుడు, అలాగే సంతానం కలుగకుండా ఎలాంటి మందులు వాడకుండా ఉన్నట్లయితే వెంటనే సంతాన నిపుణులని సంప్రదించాలి. 
 
అంతాకాకుండా ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవలసి ఉంటుంది. అవేంటో చూద్దాం.
 
1. మగవారి వీర్యంలో వీర్యకణాలు తక్కువగా ఉండడం వలన సంతానం కలుగదు. అంతేకాకుండా వీర్యకణాలు ప్రయాణించే నాళం మూసుకుపోవడం హార్మోన్ల శాతంలో తేడాలుండడం వల్ల సంతాన సమస్యలు తలెత్తుతాయి. కనుక అటువంటివారు వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా మంచిది. ఇది ఆడవారిలో మరియు మగవారిలో ఫెర్టిలిటీని పెంచే మంచి ఆహారం. దీనిలో విటమిన్ బీ6 ఎక్కువగా ఉంటుంది.
 
2. దానిమ్మ గింజలు, రసం వీర్యకణాల సంఖ్యను, వాటి కదలికలను వాటి నాణ్యతను బాగా పెంచుతాయి. 
 
3. అరటి పండులో వీర్య కణాలు పెరగటానికి అపారమైన అన్ని కారకాలు ఉన్నాయి. దీనిలో బీ 1, సి విటమిన్లు ప్రోటీన్లు లభిస్తాయి. అరటిలో ఉండే బ్రోమోలేయిన్ శక్తివంతమైన శృంగార హర్మోన్‌గా పనిచేస్తది.
 
4. పాలకూరలో ఫోలిక్ ఆసిడ్ ఉంటుంది. ఇది వీర్య వృద్ధికి సహకరిస్తుంది. పాలకురలో విటమిన్ సి, ఐరన్ కూడా లభిస్తాయి.
 
5. టొమాటో అత్యంత సాధారణంగా వాడే ఈ కూరగాయలో కెరొటినోయిడ్స్, లైకోపీన్ చక్కని వీర్య శక్తి, మంచి ఆరోగ్యం ఇస్తుంది. ప్రతిరోజూ ఆహారంలో ఏదోవిధంగా దీనిని భాగం చేసుకోవాలి. కాకపోతే పొగత్రాగడం వలన శరీరం లోని 'సి' విటమిన్ హరిస్తుంది. కాబట్టి పిల్లలు కావాలి అనుకునేవారు పొగత్రాగటం మానివేయాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్లలు టీనేజ్ లోకి వచ్చినా అదే ఆహారమా? ఇవి ఇవ్వండి...