Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిన్న వెంటనే ఫ్రిజ్ వాటర్ తాగితే..? ఇదే జరుగుతుంది...

చాలామందికి ఫ్రిడ్జ్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా ఆహారం తీసుకున్న వెంటనే ఫ్రిజ్ వాటర్ తీసుకోకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణమయ్యేందుకు కొన్ని ఎంజైములు, ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. అందుచేత ఆహారం తీసుకున్న తర్వాత 15 లే

తిన్న వెంటనే ఫ్రిజ్ వాటర్ తాగితే..? ఇదే జరుగుతుంది...
, సోమవారం, 1 ఆగస్టు 2016 (22:09 IST)
చాలామందికి ఫ్రిడ్జ్ వాటర్ తాగే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా ఆహారం తీసుకున్న వెంటనే ఫ్రిజ్ వాటర్ తీసుకోకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణమయ్యేందుకు కొన్ని ఎంజైములు, ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. అందుచేత ఆహారం తీసుకున్న తర్వాత 15 లేదా 20 నిమిషాలకు తర్వాత నీటిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఆహారం తీసుకున్న తర్వాత గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా గుండెకు ఎంతో మంచిది. గోరు వెచ్చని నీటిని తాగడం ద్వారా క్యాన్సర్ సెల్స్ ఉత్పత్తికి బ్రేక్ వేయవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. చైనీయులు, జపనీస్ ఆహారం తీసుకున్న తర్వాత గ్రీన్ టీ లేదా గోరువెచ్చని నీటిని తీసుకుంటున్నారు. 
 
గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా ఆహారం తేలిగ్గా జీర్ణం కావడంతో పాటు ఆరోగ్యానికి కీడు చేసే కొలెస్ట్రాల్‌ను నిరోధించగలుగుతుంది. అందుచేత ఆహారం తీసుకున్న తర్వాత గోరువెచ్చని సూప్ కూడా తీసుకోవచ్చు. అయితే ఫ్రిజ్ వాటర్ మాత్రం తీసుకోకూడదు. 
 
చల్లని నీరు తాగితే ఆరోగ్యానికి కీడు చేసే వ్యాధులు ఏర్పడుతాయి. గుండెపోటు, క్యాన్సర్ వంటి రోగాలు ఫ్రిజ్ వాటర్ తీసుకోవడంతో ఏర్పడతాయని పలుసార్లు తేలింది. అజీర్ణం, కొలెస్ట్రాల్ పెరగడం వంటివి జరుగుతాయి. ఫ్రిజ్ వాటర్‌ను వాడుతూ ఉంటే గుండె, కిడ్నీకి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి గోరు వెచ్చని నీరే ఆరోగ్యానికి అన్నివిధాలా మేలు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిమ్మరసంతో ఆస్త్మా తగ్గుతుందా...?