Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాలక్షేప బఠాణీలు కాదు...

బఠాణీలను చాలా మంది కాలక్షేపం కోసం ఆరగిస్తుంటారు. నిజానికి ఈ బఠాణీల వల్ల అనేక ప్రయోజనాలు ఒనగూరుతాయి. అవేంటే ఓసారి పరిశీలిస్తే...

కాలక్షేప బఠాణీలు కాదు...
, శనివారం, 23 సెప్టెంబరు 2017 (15:10 IST)
బఠాణీలను చాలా మంది కాలక్షేపం కోసం ఆరగిస్తుంటారు. నిజానికి ఈ బఠాణీల వల్ల అనేక ప్రయోజనాలు ఒనగూరుతాయి. అవేంటే ఓసారి పరిశీలిస్తే... 
 
* బఠాణీలు చర్మానికి నిగారింపును కూడా ఇస్తాయి. 
* బఠాణీలలోని విటమిన్‌ కెతో పాటు ఉండే ఇతర పోషకాలు వయసు పెరిగాక మతిమరపును తెచ్చే అల్జీమర్స్‌ డిసీజ్‌ను అరికడతాయి. 
* బఠాణీల్లో పీచుపాళ్లు, ప్రోటీన్లు చాలా ఎక్కువ. పీచు, ప్రోటీన్లు చక్కెరలను నెమ్మదిగా జీర్ణమయ్యేలా చూస్తాయి. అందుకే డయాబెటిస్‌ రోగులకు బఠాణీలు చాలా మంచిది. 
* బఠాణీల్లో ఫోలిక్‌ యాసిడ్‌ పాళ్లు ఎక్కువ. కాబోయే తల్లుకు ఫోలిక్‌ యాసిడ్‌ చాలా మేలు చేస్తుంది.
* బఠాణీల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలం. అందుకే అవి ఎన్నోరకాల క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పిస్తుంటాయి. 
* ఫ్రీ రాడికల్స్‌ను హరించే గుణం వల్ల అవి పెరిగే వయసును కనిపించనివ్వకుండా చేస్తాయి. చర్మంపై ముడతలు రాకుండా చూస్తాయి.
* ఆస్టియోపోరోసిస్‌ను అరికట్టే గుణం బఠాణీలకు ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజువారీ డైట్‌లో నట్స్ చేర్చుకుంటే.. ఒబిసిటీ మటాష్