Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఛాతి గింజలతో ఎముకలకు బలం...

జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇలా అనేక రకాల నట్స్ ఉన్నాయి. ఇవే కాకుండా మరో రకమైన నట్స్‌తో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను తెలుసుకుందాం. చెస్ట్‌నట్స్ అంటే ఛాతీ గింజలు. ఈ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అధిక బర

ఛాతి గింజలతో ఎముకలకు బలం...
, మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (10:45 IST)
జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇలా అనేక రకాల నట్స్ ఉన్నాయి. ఇవే కాకుండా మరో రకమైన నట్స్‌తో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను తెలుసుకుందాం. చెస్ట్‌నట్స్ అంటే ఛాతీ గింజలు. ఈ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అధిక బరువును తగ్గిస్తుంది. జీర్ణ సమస్యలను తొలగిస్తుంది. క్రమంగా ఈ ఛాతీ గింజలను సాయంత్రం సమయంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
ఈ గింజల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఇన్‌ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. ఈ ఛాతీ గింజల్లోని కాపర్ ఎముకల బలానికి చాలా మంచిగా దోహదపడుతుంది. ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచుటకు ఈ ఛాతీ గింజలు చక్కగా ఉపకరిస్తాయి. ఈ ఛాతీ గింజలను తరచుగా ఆహారంలో చేర్చుకుంటే గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చైనాలో చినబాబు బిజీ బిజీ