Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

థైరాయిడ్ ఎందుకు వస్తుంది... నివారించడం ఎలా?

థైరాయిడ్ ఎందుకు వస్తుంది... నివారించడం ఎలా?
, మంగళవారం, 11 డిశెంబరు 2018 (19:08 IST)
ఇటీవల కాలంలో చిన్న, పెద్ద వయసుతో సంబందం లేకుండా  థైరాయిడ్ సమస్యతో చాలా మంది భాదపడుతున్నారు. ఈ సమస్య వచ్చిన వారు బరువు తగ్గాలి, మందులు సరిగా వేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు. కాని అది సరియైన పద్దతి కాదు. అసలు ఈ థైరాయిడ్ ఎందుకు వస్తుంది? సరియైన ఆహారం తీసుకోకపోవడం, హార్మోన్లు సరిగా పని చేయకపోవడం వల్ల వస్తుంది. అందుకని మందులతో కంట్రోల్ అవుతుంది అనుకోవడం తప్పు. మందులతో పాటు సరియైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యను నియంత్రించవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. మన ఆహారపు అలవాట్లను మార్చుకోగలిగితే మందుల ప్రభావం త్వరగా కలిగి థైరాయిడ్ సమస్య నుండి బయటపడే అవకాశం ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ అనేది మెడ భాగంలో ఉంటుంది. థైరాక్సిన్ అనే హార్మోన్ శరీరంలోని జీవక్రియ రేటును కంట్రోల్ చేస్తుంది.
 
2. అవిసె గింజలు..  వీటిలో ఒమేగా-3 ప్యాటీ ఏసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పని తీరును మెరుగుపరుస్తాయి. థైరాక్సిన్ కావల్సినంత మాత్రమే ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. నిత్యం అవిసె గింజలను, లేదా పొడిని ఏదా ఒక రూపంలో ఒక టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. హైపర్ థైరాయిడ్ సమస్య ఉన్నవారు బరువు తగ్గిపోతుంటారు. నీరసంగా ఉండడం, నిద్ర పట్టకపోవడం లాంటి వాటితో బాదపడుతుంటారు.
 
3. ఉప్పు... మనం రోజూ తీసుకునే ఉప్పులో అయోడిన్ ఉంటుంది. అయితే ఉప్పును అవసరమైన దానికంటే ఎక్కివ తీసుకుంటే థైరాక్సిన్‌ను ఎక్కువ ఉత్పత్తి చేసి హైఫర్ థైరాయిడ్ కలిగేలా చేస్తుంది. ఈ సమస్య ఉన్నవారు రోజుకి 5 గ్రాముల ఉప్పుని మాత్రమే తీసుకోవాలి.
 
4. వాల్‌నట్స్.. వీటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అది థైరాయిడ్ గ్రంధి పని తీరును మెరుగుపరుస్తుంది. దీంతో థైరాక్సిన్ అవసరమున్నంత మేర శరీరానికి అంది థైరాయిడ్ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. 
 
5. అల్లం... థైరాయిడ్ సమస్య ఉన్నవారు అల్లాన్ని తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. నిత్యం ఉదయాన్నే పరగడుపున ఒక స్పూన్ అల్లం రసం తేనెతో సేవించాలి. దీంతో థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగుపడుతుంది.
 
6. హైఫో థైరాయిడ్ ఉన్నవారు పచ్చి కూరగాయలను తక్కువగా తింటే మేలు. దీంట్లో ఉండే జియోట్రెజిన్ మంచిది కాదు. క్యాబేజి, కాలీప్లవర్, బ్రకోలి, ముల్లంగి తాంటివి తక్కువగా తింటే మంచిది. వీరు పాలతో చేసిన పదార్దాలు తక్కువగా తీసుకుంటే మంచిది.థైరాయిడ్ సమస్య ఉన్నవారు మందులు, ఆహారంలో మార్పులతో పాటు వ్యాయామం కూడా చేస్తుండాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిద్రలో ఉండగా గబుక్కున లేచి శృంగారం చేస్తారు.. ఆయనకేమైనా జబ్బా?