Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అవి తినకండి... వృద్ధ ఛాయలు త్వరగా వచ్చేస్తాయి....

శరీరానికి క్యాల్షియం కావాలి. పాలలో ఇది అధికంగా వుంటుంది. ఇది ఎముకలకు మేలు చేసేదే. దీనివలన ఎముకలు పుష్ఠిగా వుంటాయి. దృఢమైన ఎముకల వలన శరీరం నిటారుగా నిలుస్తుంది. చక్కని రూపం వస్తుంది. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె కండరాలు ఆరోగ్యంగా వుంటాయి. పాలు అంతగా

అవి తినకండి... వృద్ధ ఛాయలు త్వరగా వచ్చేస్తాయి....
, శుక్రవారం, 11 నవంబరు 2016 (17:26 IST)
శరీరానికి క్యాల్షియం కావాలి. పాలలో ఇది అధికంగా వుంటుంది. ఇది ఎముకలకు మేలు చేసేదే. దీనివలన ఎముకలు పుష్ఠిగా వుంటాయి. దృఢమైన ఎముకల వలన శరీరం నిటారుగా నిలుస్తుంది. చక్కని రూపం వస్తుంది. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. గుండె కండరాలు ఆరోగ్యంగా వుంటాయి. పాలు అంతగా ఇష్టపడనివారు పెరుగును చిలక్కొట్టి మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు. 
 
చేపలు.. వారానికి రెండుసార్లు చేపలను ఆహారంగా తింటే చర్మం మెరుస్తూ వుంటుంది. బాగా తైలం కలిగిన చేపలు మరీ మంచివి. వీటిలో ఒమేగా-3 పాలీ అన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ గుండెజబ్బులు రానివ్వవు. ఎండు చేపలను తినడం తగ్గించడం మంచిది. 
 
మాంసం మాత్రం వారానికి ఒకసారి మాత్రమే తీసుకోవాలి. కొవ్వులు తక్కువగా వుండే మాంసాన్నే తినాలి. కొవ్వులు తక్కువగా వుండే మాంసాన్నే తినాలి. ప్రొటీన్‌లు అధికంగా వుండే విధంగా చూసుకోవాలి. లేకుంటే మాంసంతో ఇబ్బంది వస్తుంది. 
 
అయితే ఇవి మాత్రం తినకండి..
ఆహారంలో అధిక ఉప్పు అనవసరం. చక్కెర ఫరవాలేదు కాని అదనపు చక్కెర అనర్థం. గ్లూకోజ్, సుక్రోజ్ వంటివి తీసుకోవద్దు. చక్కెరలు శరీరంలో ప్రొటీన్లతో జరిపే చర్యల వల్ల శరీరంలో వయసు మీద పడిన లక్షణాలు వస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆఫీసుల్లో టెన్షన్.. ఒత్తిడితో అందం మటాష్.. కొబ్బరినూనె దివ్యౌషధం..