Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శీతాకాలంలో నడక ఎంతో ముఖ్యం... ఎందుకో తెలుసా?

శీతాకాలంలో నడక ఎంతో ముఖ్యం... ఎందుకో తెలుసా?
, శుక్రవారం, 28 డిశెంబరు 2018 (19:41 IST)
సాధారణంగా మనం ఉదయం లేవగానే ఉరుకులు పరుగుల జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాము. దీని ప్రభావం మనకు తెలియకుండానే మన ఆరోగ్యంపై పడుతుంది. దీనివలన రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఉద‌యాన్నే 30 నిమిషాల న‌డ‌క మీ జీవ‌న గ‌తినే మార్చుతుంది. ముఖ్యంగా డ‌యాబెటిస్‌, ఒబేసిటీ, గుండె రుగ్మ‌త‌లు లాంటి్వి ఉంటే ఉద‌య‌పు న‌డ‌క‌తో వీటి తీవ్ర‌త త‌గ్గుతుంది. కండ‌రాల‌కు, గుండెకు చాలా మంచిది. ఉద‌య‌పు చ‌లిగాలులు న‌రాల‌కు మంచిది. 30 నిమిషాల ఉద‌య‌పు న‌డ‌క 2 గంట‌ల జిమ్‌తో స‌మానం. ఉద‌యం న‌డిస్తేనే మంచిది ఎందుకంటే...
 
1. ఉద‌యాన్నే గాలిలో క‌లుషిత‌పు ఛాయ‌లు త‌క్కువ‌గా ఉంటాయి. తాజా గాలిలో ప్రాణ‌వాయువు పుష్క‌లంగా ఉంటుంది. ప్రాణ‌వాయువు శ‌రీరంలోని క‌ణాల‌కు బాగా అందుతుంది త‌ద్వారా అన్ని ప‌నులు సునాయాసంగా జరిగిపోతాయి. శ‌రీరం బాగా ప‌నిచేసిన‌ప్పుడు ఎలాంటి రోగాలు అంత తొంద‌ర‌గా ద‌రిచేర‌వు.
 
2. శ‌రీరంలో కొవ్వును క‌రిగించ‌డంలో ఇది స‌హ‌క‌రిస్తుంది. న‌డ‌క మంచిదే. బ్రిస్క్ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల గుండె వ్యాధులు త‌గ్గుతాయి. ఉద‌యాన్నే 30 నిమిషాలపాటు న‌డ‌వ‌డం వ‌ల్ల బీపీ త‌గ్గుతుంది. ప్ర‌తి రోజు ఉదయాన్నేన‌డ‌క‌ను అల‌వాటు చేసుకోవ‌డం వ‌ల్ల బీపీ అదుపులో ఉంటుంది.
 
3. చాలా ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు ఒబేసిటీ కార‌ణం. రోజులో ఎక్కువ స‌మ‌యం క‌ద‌ల‌కుండా కూర్చోవ‌డం వ‌ల్ల ఒబేసిటీ వ‌స్తుంది. బ‌రువు త‌గ్గాల‌నుకుంటే ఉదయపు నడక చాలా మేలు చేస్తుంది. ఇది బ‌రువు త‌గ్గించ‌డంలో స‌హ‌క‌రిస్తుంది.
 
4. అర్థ‌రైటిస్‌ను నివారిస్తుంది. అంత‌గా క‌ద‌లిక లేని జీవితాన్ని గ‌డ‌ప‌డం వ‌ల్ల మోకాలి కండ‌రాలపై ప్ర‌భావం చూపిస్తుంది. ముఖ్యంగా మ‌హిళ‌ల్లో ఎముక‌ల దృఢ‌త్వం త‌గ్గుతుంది. నిదానంగా న‌డ‌వ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు త‌గ్గి ఎముక‌లు దృఢంగా త‌యార‌వుతాయి. 
 
5. శ‌రీరం ఆరోగ్యంగా ఉండేందుకు కొంచెం కొల‌స్ట్రాల్ అవ‌స‌ర‌మ‌వుతుంది. ర‌క్తంలో కొలెస్ట్రాల్ నిల్వ‌లు తగ్గితే శ‌రీర బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది.  
 
6. జ్ఞాపక శక్తి పెరగడం, మెద‌డు చురుగ్గా పనిచేయడం లాంటివి ఉదయంపూట నడవటం వలన మాత్రమే సాధ్యమవుతుంది. ఉదయం పూట నడవటం వ‌ల్ల శ‌రీరం పున‌రేత్త‌జిమ‌వుతుంది. న‌డిచిన‌ప్పుడు ఆక్సిజ‌న్ బాగా అంది ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ మెరుగ‌వుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా భార్య నస భరించలేక పోతున్నా... తిడుతోంది...