Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీవారి తెప్పోత్సవాలు

అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీవారి తెప్పోత్సవాలు
, సోమవారం, 2 మార్చి 2015 (11:12 IST)
తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. సర్వజగద్రక్షుడైన స్వా­ువారు పుష్కరిణిలో శ్రీ సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి అవతారంలో తెప్ప పై ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. ఈ సందర్భంగా స్వా­ువారు తెప్ప పై మూడు సార్లు పుష్కరిణిలో ప్రదక్షణగా విహరించారు. స్వామివారి శోభాయమాన రూపాన్ని తిలకించిన భక్తులు తన్మయంతో పులకించిపోయారు. 
 
కాగా ప్రతి సంవత్సరం పాల్గుణమాసంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఐదు రోజులపాటు ఈ తెప్పోత్సవాలను టిటిడి వైభవంగా నిర్వహిస్తున్నది. తెప్పోత్సవాల కారణంగా శ్రీవారి ఆర్జిత సేవలైన వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టిటిడి రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టిటిడి సాంబశివరావు దంపతులు, ఆలయ డిప్యూటిఇఓ చిన్నంగారి రమణ, అడిషనల్‌ సి­అండ్‌ఎస్‌ఓ శివకుమార్‌రెడ్డి, వాటర్‌వర్క్స్‌ ఇఇ నరసింహమూర్తి, గార్డెన్‌ సూపరిండెంట్‌ శ్రీనివాసులు, హెల్త్‌ ఆఫీసర్‌ వెంకటరమణ, పేష్కార్లు సెల్వం, కేశవరాజు, పెద్దజియ్యంగార్ల బృందం, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu