Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్తులు సంపాదించలేకపోయినా పర్లేదు- పుణ్యం కూడగట్టుకోండి.. పితృదేవతలను అలా పూజిస్తే?

కర్మ ఫలాలను ఆశించే మానవునికి కష్టనష్టాలుంటాయని పురాణాలు, వేదాలు చెప్తున్నాయి. మానవుడు తాను చేసిన పుణ్యాలను బట్టి సుఖమయ జీవితాన్ని జీవిస్తాడు. పాపపు పనులు చేస్తే మాత్రం కష్టాలు అనుభవిస్తాడని పురాణాలు చ

ఆస్తులు సంపాదించలేకపోయినా  పర్లేదు- పుణ్యం కూడగట్టుకోండి.. పితృదేవతలను అలా పూజిస్తే?
, బుధవారం, 14 జూన్ 2017 (18:38 IST)
కర్మ ఫలాలను ఆశించే మానవునికి కష్టనష్టాలుంటాయని పురాణాలు, వేదాలు చెప్తున్నాయి. మానవుడు తాను చేసిన పుణ్యాలను బట్టి సుఖమయ జీవితాన్ని జీవిస్తాడు. పాపపు పనులు చేస్తే మాత్రం కష్టాలు అనుభవిస్తాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే పెద్దలు ఆస్తులు సంపాదించకపోయినా.. భావితరాలకు  పుణ్యాన్ని సంపాదించి పెట్టాలని అంటారు. అలాంటి పుణ్యాన్ని సంపాదించాలంటే దానధర్మాలు చేయాలంటారు. దానధర్మాలను చేయడం ద్వారా తమ వారసులకు మంచి చేయవచ్చునని... వారికి పుణ్యఫలం చేకూర్చవచ్చునని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాంటి దానాల్లో అన్నదానం మిన్నగా నిలుస్తుంది. అన్నదానం చేసేవారికి 3 తరాల వరకు పుణ్యఫలం లభిస్తుంది. అలాగే పుణ్యక్షేత్రాల్లో దీపం వెలిగిస్తే.. ఐదు తరాల వారికి మేలు చేకూరుతుందని, పేదల ఆకలి తీర్చితే.. ఐదు తరాలకు పుణ్యం చేకూరుతుందట. పితృదేవతలను పుణ్యం చేస్తే.. ఆరు తరాల వారికి మంచి జరుగుతుంది. అనాధలై మరణించిన వారికి అంత్యక్రియలు చేస్తే... 9 తరాల వారికి పుణ్యం లభిస్తుంది. 
 
పితృదేవతలను వారు మరణించిన తిథిని బట్టి పూజిస్తే.. 21 తరాలకు మేలు జరుగుతుంది. పశువులను సంరక్షించడం ద్వారా 14 తరాల వారికి పుణ్యఫలమిస్తుందని పండితులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలకు వెళుతున్నారా... మీ పిల్లలు జాగ్రత్త.. (వీడియో) చూడండి ఎలా ఎత్తుకెళ్తున్నాడో...