Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మనుషులకు-జంతువులకు తేడా ఎక్కడుంది?.. సద్గురు

జనాభాలో కనీసం ఒక్క శాతం మందికి కూడా వారిలో ఆధ్యాత్మిక ప్రక్రియ జరగటం లేదు. మిగిలిన వాళ్ళందరూ- పరిస్థితులు సక్రమంగా సాగుతున్నంత కాలం, నవ్వుతూ గడుపుతారు, పరిస్థితులు విషమించినపుడు దుఃఖంతో క్రుంగిపోతారు.

మనుషులకు-జంతువులకు తేడా ఎక్కడుంది?.. సద్గురు
, శనివారం, 13 మే 2017 (13:38 IST)
జనాభాలో కనీసం ఒక్క శాతం మందికి కూడా వారిలో ఆధ్యాత్మిక ప్రక్రియ జరగటం లేదు. మిగిలిన వాళ్ళందరూ- పరిస్థితులు సక్రమంగా సాగుతున్నంత కాలం, నవ్వుతూ గడుపుతారు, పరిస్థితులు విషమించినపుడు దుఃఖంతో క్రుంగిపోతారు. ఏది ఎలా ఉన్నా సరే , ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించి, తమలో తాము సమతుల్యంలో, ఉండగలిగిన వారు, ప్రపంచంలో చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. వారికి ఏదీ గొప్ప వరమూ కాదు, ఏదీ ఒక సమస్యా కాదు. జీవితంలో జరిగేవన్నీ కూడా వారి దృష్టిలో కేవలం జీవితంలోని పరిస్థితులే. 
 
వారి దృష్టిలో అన్నీ కూడా ముక్తికి మరొక సోపానాలే. మిగిలిన వారందరూ, పరిస్థితులు వారిని ఎలా తోస్తే, అలా వెళ్ళిపోయే రకాలు. వారు మానవ శరీరంతో ఉన్న పశువులలాంటి వాళ్ళు, నిజానికి వారికీ, పశువులకూ ఏ వ్యత్యాసమూ లేదు. జంతువులు జీవించే విధానానికి, మనుషులు సాధారణంగా జీవించే విధానానికీ - గుణంలో ఏమైనా పెద్ద తేడా ఉందా? చూడడానికి కొంచెం తేడా ఉంటే ఉండొచ్చు. మనుషులు  చేసే కార్యకలాపాలలో చాలా వైవిధ్యం ఉండవచ్చు. మనుషులు కారు నడుపుతారు, టెలివిజన్‌ చూస్తారు, ఇంకా చాలా చేస్తారు. కానీ గుణంలో మనుషులకూ, జంతువులకూ తేడా ఎక్కడుంది?
 
ఆ తేడా రావాలంటే - అది కేవలం ఒక్క చైతన్యంతో మాత్రమే వస్తుంది. మరో మార్గమేమీ లేదు. సాధారణంగా, చైతన్యం అంటే, మానసికపరమైన చురుకుదనం అని పొరపాటు పడతారు. కానీ, చైతన్యం చాలా లోతైన అంశం. అది ఒక్క మానసికపరమైన చురుకుతనం మాత్రమే కాదు. మీలోని  చైతన్యం వికసించినప్పుడు, మీలో ప్రేమ కారుణ్యాలు సహజంగానే  ఉప్పొంగుతాయి. అపుడు మీ ప్రతి శ్వాసా, ఎదుగుదలకు ఒక సోపానమే అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా జీవితం శూన్యం అని రావణాసురుడు ఎప్పుడు అనుకున్నాడు?