Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హోలీ ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

పూర్వం "హోలిక" అనే రాక్షసిని రఘుమహారాజు చంపినట్లు ఉన్న గాథతో పాటుగా మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేమిటంటే..? హోలిక అనే రాక్షసి రోజుకో చంటి బిడ్డను తింటూ ఒక్కో గ్రామంపై విరుచుకుపడుతుండేదట. ఇలా ఒకరోజు ఒక ముదుసలి మనుమడి వంతు రాగా, అది గమనించిన వృద్ధు

హోలీ ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
, శనివారం, 24 ఫిబ్రవరి 2018 (15:20 IST)
పూర్వం "హోలిక" అనే రాక్షసిని రఘుమహారాజు చంపినట్లు ఉన్న గాథతో పాటుగా మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేమిటంటే..? హోలిక అనే రాక్షసి రోజుకో చంటి బిడ్డను తింటూ ఒక్కో గ్రామంపై విరుచుకుపడుతుండేదట. ఇలా ఒకరోజు ఒక ముదుసలి మనుమడి వంతు రాగా, అది గమనించిన వృద్ధురాలు హోలిక బారినుండి మనుమడితో పాటు ఆ గ్రామానికి చెందిన చంటి పిల్లలను కాపాడే దిశగా ఒక మహిమాన్వితుడైన మహర్షిని శరణువేడుకుంటుంది.
 
ఆ రాక్షసి ఓ శాపగ్రస్తురాలని, ఎవరైనా ఆ రాక్షసిని నోటికి రాని దుర్భాషలతో తిట్టినట్లైతే దానికి ఆయుష్షు క్షీణించి, మరణిస్తుందని ఋషి ఉపాయమిస్తాడు. దీంతో ఎంతో సంతోషంతో ఆ వృద్ధురాలు ఆ గ్రామవాసులకు ఈ విషయాన్ని చెప్పి, ఆ రాక్షసిని ఆ గ్రామస్తుల చేత అనరాని దుర్భాషలతో తిట్టిస్తుంది. ఆ దుర్భాషలను తట్టుకోలేక కొండంత "హోలిక" రాక్షసి కుప్పకూలి మరణిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
 
హోలిక మరణంతో పిల్లలు పెద్దలు ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ కట్టెలు ప్రోగుచేసి ఆ చితిమంటల్లో "హోలీ రాక్షసి"ని కాల్చివేసి వసంతాలు చల్లుకుంటూ పండుగ చేసుకుంటారు. ఈ రోజు నుంచే హోలి పండుగ ఆచారంలోకి వచ్చిందని పండితులు అంటున్నారు. ఇదేవిధంగా చైత్ర పాడ్యమి రోజున పితృదేవతలకు అర్ఘ్యమిచ్చి సంతృప్తి పరచి, హోలికా భూమికి నమస్కరిస్తే సర్వదుఃఖాలు తొలగి పోతాయని విశ్వాసం. 
 
ఇకపోతే.. ఉత్తర భారతదేశంలో ప్రారంభించబడిన ఈ పండుగ అలా దక్షిణ భారత దేశానికి కూడా వ్యాపించింది. రాష్ట్రంలోని తెలంగాణా, రాయలసీమ ప్రాంతాలతో హోలి పండుగను ప్రస్తుతం వైభవంగా జరుపుకుంటున్నారు. చిన్నపెద్ద, ఆడ, మగ తేడా లేకుండా, రంగులు పులుము కుంటూ వసంతాలు చల్లుకుంటూ ఆనంద డోలికలతో తేలియాడుతుంటారు. ఇటువంటి ఆహ్లాదకరమైన హోలి పండుగ సందర్భంగా మనమందరం సుఖసంతోషాలతో జీవించాలని ఆశిద్దాం...!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ వారం మీ రాశి ఫలితాలు... 25-02-2018 నుంచి 03-03-2018 వరకు...