Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాలీవుడ్ ప్రతిభతో తొలి హాలివుడ్ మూవీ ది డిజర్వింగ్

The Deserving poster
, శనివారం, 16 సెప్టెంబరు 2023 (16:31 IST)
The Deserving poster
ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఆధ్యాంతం అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే సంచలనాత్మకమైన "ది డిజర్వింగ్" అనే చిత్రాన్ని తెలుగు హీరో వెంకట్ సాయి గుండ హాలీవుడ్ లో భారీ అంచనాల నడుమ తెరకెక్కిస్తున్నాడు. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్నా ఈ సంచలనాత్మకమైన ప్రాజెక్ట్, సినిమా చరిత్రలో ఒక బెంచ్ మార్కును సెట్ చేయడానికి సిద్ధమౌతుంది. నటుడు వెంకట్ సాయి గుండ కేవలం ఈ సినిమాలో హీరోగానే కాదు నిర్మాతగా వ్యవహరిస్తూ హాలీవుడ్ లో తెలుగు ప్రతిభకు పట్టం కడుతున్న దార్శనీకుడు.

ప్రపంచ మేధావుల కలయికతో వెండి తెరపై ఒక అద్భుతాన్ని ఆవిష్కరించడానికి వెంకట్ సాయి గుండ శ్రీకారం చుట్టారు. ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూసేలా ఈ చిత్రాన్ని తీర్చబోతున్న ఘనత వెంకట్ సాయి గుండకు చెందుతుంది. హాలీవుడ్ లో ప్రధానపాత్రదారుడిగా ఒక తెలుగు వాడు నటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
 
పాన్ వరల్డ్ చిత్రంగా తిరకెక్కుతున్న "ది డిజర్వింగ్" చిత్రంలో ప్రపంచ నలుమూలల నుండి ప్రఖ్యాతగాంచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పని చేయడం గమనార్హం. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ద్వారా ప్రతిభవంతుడిగా గుర్తింపుని పొందిన ఎస్ ఎస్ అరోరా ఈ చిత్రానికి రచన దర్శకత్వం వహించారు. అలాగే ఎస్ ఎక్స్ ఎస్ డబ్ల్యూ ఫిలిం ఫెస్టివల్ తో సహా ప్రఖ్యాత అనేక ప్లాట్ ఫామ్స్ ల నుండి ప్రశంసలు పొందిన కోషి కియోకావా ఈ చిత్రానికి గ్రిప్పింగ్ కథనంతో పాటు సినిమాటోగ్రఫీ అందించారు. హాలివుడ్ లో ప్రఖ్యాత సిరీస్ ట్రాన్స్ఫార్మర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ స్టీవ్ జబ్లోన్స్కీ దగ్గర పని చేసి ఎన్నో అంతార్జాతీయ అవార్డులను కైవస్ చేసుకున్న ప్రసిద్ధ హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ Nga Weng Chio(Nga వెంగ్ చియో) ఈ చిత్రానికి అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ ను అందించారు.
 
చిత్ర పరిశ్రమ పైన ప్యాషన్ తో హీరో వెంకట్ సాయి గుండ ఈ చిత్రాన్ని హాలీవుడ్ లో నిర్మించడం ఒక చరిత్రాత్మకమైన పరిణామం. దీంతో టాలీవుడ్ హాలీవుడ్ కి మధ్య గొప్ప వారధిగా "ది డిజర్వింగ్" చిత్రం నిలవబోతుంది. ఈ చిత్రాన్ని ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్ర దర్శక నిర్మాతలు "ది డిజర్వింగ్" తీర్చిదిద్దారు. ఎప్పుడు కొత్తదనాన్ని ప్రత్సహించే వెంకట్ సాయి గుండ ఎక్కడా వెనకాడకుండా ఈ చిత్రాన్ని అత్యంత గొప్ప నిర్మాణ విలువలు అందించినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది అని నిర్మాత నమ్మకంగా ఉన్నారు.
 
నటీనటులు: వెంకట్ సాయి గుండ, సిమోన్ స్టాడ్లర్, కెల్సీ స్టార్ట్లర్, తదితరులు
రచన & దర్శకత్వం: S.S అరోరా
ప్రొడక్షన్ హౌస్: కథా ప్రొడక్షన్స్
నిర్మాతలు: వెంకట్ సాయి గుండ, విస్మయ్ కుమార్, తిరుమలేష్ గుండ్రాత్
సంగీతం: Nga వెంగ్ చియో(Nga Weng Chio)
సినిమాటోగ్రఫీ: కోషి కియోకావా
పీఆర్ఓ: హరిష్, దినేష్
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సౌరభ్ చంద్రశేఖర్ వివాహం.. రూ.200 కోట్ల ఖర్చు.. సన్నీ, టైగర్ ష్రాఫ్‌కు కష్టాలు