Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆక‌లిని పెంచే ఆహారాలు ఏంటి? (Video)

ప్రస్తుతకాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఆకలిగా లేకపోవడం. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం. గ్యాస్, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం. వీటి నుంచి బయటపడేందుకు విపరీతంగా మందులు వాడటం. వీటివల

ఆక‌లిని పెంచే ఆహారాలు ఏంటి? (Video)
, సోమవారం, 9 జులై 2018 (11:32 IST)
ప్రస్తుతకాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఆకలిగా లేకపోవడం. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం. గ్యాస్, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం. వీటి నుంచి బయటపడేందుకు విపరీతంగా మందులు వాడటం. వీటివల్ల చాలా మందిలో ఆకలి నశిస్తోంది.
 
ఇలాంటి పరిస్థితి కొందరిలో వుంటే.. మరికొందరిలో మాత్రం ఆకలి ఉంటుంది కానీ ఏమీ తినాలని అనిపించదు. అయితే ఎవరైనా కింద సూచించిన పలు పదార్థాలను తీసుకుంటే దాంతో ఆకలిని పెంచుకోవచ్చు. ఫలితంగా ఆహారం చక్కగా తినాలనిపిస్తుంది. మరి ఆకలి పెరగాలంటే మనం తీసుకోవాల్సిన ఆ పదార్థాలు ఏమిటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
* ఆకలి లేక ఇబ్బంది పడేవారు రోజూ 4, 5 ఖర్జూరాలను తింటే ఫలితం ఉంటుంది. లేదా ఖర్జూరం రసం తాగినా మేలే. 
 
* దాల్చిన చెక్క‌ను పొడి చేసి అందులో కొద్దిగా చక్కెర, సరిపడినంత తేనె కలిపి రోజూ తీసుకుంటే ఫలితం ఉంటుంది.
 
* నిమ్మ‌ర‌సం జీర్ణక్రియకు ఇది చాలా మంచి చేస్తుంది. శరీరంలోని హానికారక వ్యర్థాలను బయటకు పంపుతుంది. ఆకలి మందగించిన వారు గ్లాస్ నీటిలో కాస్త నిమ్మరసం పిండి అందులో కొద్దిగా తేనె, ఉప్పు కలిపి తీసుకోవాలి. 
 
* వికారం, అజీర్తి సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు అల్లం మంచి పరిష్కారాన్ని చూపుతుంది. ప్రతి రోజూ కొన్ని అల్లం ముక్కల్ని దవడన పెట్టుకుని నమిలి మింగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. 
 
* మెంతుల‌ను తీసుకోవడం వల్ల జీర్ణాశయంలోని గ్యాస్ ఇట్టే బయటకు వెళ్తుంది. ఇలా చేయడం కూడా ఆకలి పెంచుతుంది. ప్రతి రోజూ ఉదయం కొద్దిగా మెంతిపొడిలో తేనె కలిపి తీసుకోవడం మంచిది. పెరుగులో కలిపి కూడా తినొచ్చు. 
 
* ద్రాక్ష పండ్లలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ సాఫీగా జరగడానికి సహాయం చేస్తుంది. భోజనం చేశాక ద్రాక్ష పండ్లను తింటే జీర్ణం బాగా అవడమే కాకుండా ఆకలి కూడా బాగా వేస్తుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలబంద గుజ్జుతో పళ్లు తోముకుంటే.. నోటి దుర్వాసన..?