Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'చక్కెర'కు విరుగుడు మెంతులు.. ఔషధ గుణాలు పుష్కలం

'చక్కెర'కు విరుగుడు మెంతులు.. ఔషధ గుణాలు పుష్కలం
, గురువారం, 6 డిశెంబరు 2018 (12:04 IST)
మధుమేహ వ్యాధి రోగుల్లో మనదేశం రెండో స్థానంలో ఉంది. ఈ వ్యాధి బారినపడే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అలాంటి వ్యాధికి శాశ్వతంగా నయం చేసే మందులను మాత్రం శాస్త్రవేత్తలు ఇంకా కనిపెట్టలేక పోతున్నారు. అలాంటి చక్కెర వ్యాధికి వంటిల్లో ఉండే మెంతులతో చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి ఔషధ గుణాలకు పెట్టింది పేరు. వీటిల్లో అనేక ఔషధగుణాలు దాగి ఉన్నాయి. 
 
* షుగర్‌ వ్యాధితో బాధపడేవారికి మెంతులు బాగా ప‌నిచేస్తాయి. 
* శరీరంలో గ్లూకోజ్‌ స్థాయిని నియంత్రించడంతోపాటు, గ్లూకోజ్ శాతాన్ని అదుపులో ఉంచుతుంది. 
* రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉన్నవారు రోజూ ఉదయం అరస్పూన్‌ మెంతిపొడి తీసుకుంటే సమస్య త‌గ్గుతుంది. 
* మెంతులు టైప్‌-1, టైప్‌-2 మధుమేహాలు రెండింటిలోనూ ఔషధంగా పని చేస్తాయి. 
* మెంతుల్లో ఉండే ఔష‌ధ గుణాలు మధుమేహం మీద పని చేస్తాయి.
* అనేక రోగాలకు కారణమయ్యే కఫాన్ని, వాతాన్ని మెంతుల వాడకంతో తగ్గించవచ్చు. 
* మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఇవి దివ్యౌష‌ధంగా ప‌నిచేస్తాయి. 
* శరీరంలో ఎక్కువగా ఉండే చెడు కొలెస్ట్రాల్‌ నిల్వలను మెంతులు నియంత్రిస్తాయి. 
* అధిక బరువు సమస్య నుంచి బ‌య‌ట ప‌డాలంటే మెంతుల‌ను వాడాలి. 
* మెంతులు జీర్ణ వ్యవస్థను శక్తివంతం చేసి ఆకలిని పెంచుతాయి. 
* చెమటను పుట్టించి శరీరాన్ని చల్లబరిచే గుణం మెంతుల్లో ఉంది. 
* నీళ్ల విరేచనాలను అరికట్టడంలో మెంతులు బాగా పనిచేస్తాయి. 
* మెంతుల్లోని జిగురు తత్వం పేగుల్లో అల్సర్లని తగ్గించడంతోపాటు పేగుల లోపలి వాపును తగ్గిస్తుంది. 
* మెంతులు చేదుగా ఉంటాయి. ఈ చేదుగుణం కాలేయాన్ని శక్తివంతం చేస్తుంది.
* పునరుత్పత్తి సమస్యల్లోనూ మెంతులు ఔషధంగా పని చేస్తాయి. 
* మెంతుల్లో ఉండే ఔషధ కార‌కాలు మహిళల గర్భాశయ ఆరోగ్యాన్ని పెంచుతాయి. 
* తల్లిపాల తయారీకి మెంతులు ప‌నిచేస్తాయి. 
* నడుము నొప్పి, సయాటికా, కీళ్లనొప్పి, వాపులు, కండరాల నొప్పి నివారణలోనూ ప‌నిచేస్తాయి. 
* ఎముకలను శక్తివంతం చేయటం వల్ల ఆస్టియోపోరోసిస్‌, నడుము నొప్పి, జుట్టు రాలటం, ఎముకల బలహీనత వంటి సమస్యలు తొలగిపోతాయి.
* మెంతులను నీళ్లతో కలిపి పై పూతగా లేదా పొట్టుగా వాడితే ఇన్ఫెక్షన్లు, చీము పొక్కులు, ఎముకలు విరగటం, కీళ్లవాపు మొదలైన సమస్యలు తగ్గుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేతి వేళ్లతో వ్యాయామం ఎలా చేయాలో తెలుసా..?