Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉదయాన్నే ఒకట్రెండు వెల్లుల్లి రెబ్బల్ని తింటే ఆ జబ్బు అదుపు

మనం ప్రతి రోజు చేసుకునే కూరల్లో దాదాపుగా వెల్లుల్లిని వాడుతుంటాము. కూర రుచిగా ఉండాలన్నా, మంచి సువాసన రావాలన్నా వెల్లుల్లిని ఉపయోగించాల్సిందే. అయితే ఈ వెల్లుల్లి కూరల్లోనే కాదు మన ఆరోగ్యానికి కూడా మంచి ఔషధంలా పని చేస్తుంది. దీనిలో అనేక రకములైన ఆరోగ్య

ఉదయాన్నే ఒకట్రెండు వెల్లుల్లి రెబ్బల్ని తింటే ఆ జబ్బు అదుపు
, శనివారం, 16 జూన్ 2018 (19:21 IST)
మనం ప్రతి రోజు చేసుకునే కూరల్లో దాదాపుగా వెల్లుల్లిని వాడుతుంటాము. కూర రుచిగా ఉండాలన్నా, మంచి సువాసన రావాలన్నా వెల్లుల్లిని ఉపయోగించాల్సిందే. అయితే ఈ వెల్లుల్లి కూరల్లోనే కాదు మన ఆరోగ్యానికి కూడా మంచి ఔషధంలా పని చేస్తుంది. దీనిలో అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. 
 
1. వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఇన్ప్లేమేటరీ గుణాలు ఉండడం వల్ల ప్రతిరోజు వెల్లుల్లిని వాడడం మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉన్నా ఆ సమస్యను తగ్గించే గుణం వెల్లుల్లికి ఉంది.
 
2. దగ్గుతో బాధపడేవారు వెల్లుల్లిని దంచి దానికి కొంచెం తేనే కలిపి రెండు గంటలకు ఒకసారి తినడం వల్ల దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు. రక్త ప్రసరణ బాగా జరగడానికి, కొవ్వుని తొలగించడానికి వెల్లుల్లి దోహదపడుతుంది.
 
3. హృదయ సంబంధిత రోగాలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయాన్నే ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం మంచిది. అలాగే అధిక రక్తపోటుతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల ఆ సమస్య అదుపులో ఉంటుంది.
 
4. వెల్లుల్లి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లిలోని యాంటీబయాటిక్ గుణాలు అజీర్ణం. హైబీపీలను తక్షణం నివారిస్తుంది. శరీరంలోని ఇమ్యునిటీ లెవల్స్‌ని వెంటనే పెంచుతుంది.    
 
5. అధిక బరువుతో బాధపడేవారు రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని ముక్కలుగా చేసి మెత్తగా పేస్ట్ చేసి దానిలో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా నెల రోజుల పాటు తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు.
 
6. పచ్చి వెల్లుల్లిలో ఉండే అల్లెసిన్ అనే కంటెంట్ మెటబాలిజం రేటును పెంచుతుంది. ఇది కొవ్వు త్వరగా కరగడానికి సహాయపడుతుంది.
 
7. వెల్లుల్లి పేస్టుని చర్మంపై మొటిమలు, అలర్జీ వంటి వాటిపై రాస్తే ఉపశమనం కలుగుతుంది. రక్త నాళాల్లోని మలినాలు తొలగిపోతాయి. మోకాలి నొప్పులతో బాధపడేవారు వెల్లుల్లి రసాన్ని మోకాలిపై నొప్పి ఉన్న చోట రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొబ్బరినూనెను వంటకు ఉపయోగిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి?