Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆహారంలో పెరుగును ఎందుకు తినాలంటే?

ఆహారంలో పెరుగును ఎందుకు తినాలంటే?
, గురువారం, 7 సెప్టెంబరు 2023 (15:11 IST)
చాలా మందికి పెరుగు అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. అనేక మంది దీన్ని ఆరగించేందుకు ఇష్టపడరు. అయితే, పెరుగు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయాన్ని అనేక మంది న్యూట్రిషన్లతో పాటు వైద్యులు కూడా చెప్పారు. అసలు ఆహారంలో పెరుగు తీసుకోవడం వల్ల కలిగే లాభ నష్టాలు ఏంటో పరిశీలిద్ధాం. 
 
పెరుగులో మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా కడుపులోని యాసిడ్ స్థాయిలను నియంత్రిస్తూ ఉంటుంది. అందువల్ల ఆహారం తిన్న పెరుగు తినమంటారు. లేదా మజ్జిగ తాగమంటారు. కొందరికి కడుపునెప్పి తరచు వస్తూ ఉంటుంది. విరోచనాలు కూడా ఆవుతూ ఉంటాయి. దీనికి బిలోఫిలియా అనే బ్యాక్టీరియా కారణం. ఈ బ్యాక్టీరియాను ఎదుర్కోవటంలో పెరుగు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 
 
పెరుగులో కాల్షియం, ఫాస్పరిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పెరుగులో కొవ్వు ఎక్కువ ఉంటుందని.. దీని వల్ల గుండెకు ఇబ్బంది కలుగుతుందని కొందరు భావిస్తారు. కానీ పెరుగు మంచి కొలస్ట్రాల్‌ను పెంపొందించటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. పెరుగులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. అందు వల్ల దీనిని తింటే శరీరంలో బ్లడ్ సుగర్ విలువలు తగ్గుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దీనిని తినవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హెమోరాయిడ్స్‌ను నయం చేసే అరటిపుప్పు