Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హోమియోపతితో అప్నియా దూరం

హోమియోపతితో అప్నియా దూరం
, గురువారం, 9 ఆగస్టు 2007 (17:37 IST)
పగటిపూట నిద్రపోతూనే చాలామంది గురకతీస్తుంటారు. వీరిక రాత్రిపూట నిద్ర కరువే. కష్టపడి పనిచేయటం ద్వారా వీరికి గురక వస్తుందని కాదు. దీనికి స్లీప్ అప్నియా అంటారు. స్లీప్ అప్నియా వ్యాధికి ముఖ్య లక్షణం ఈ గురక తీయడమే అంటున్నారు. హోమియోపతి నిపుణులు. ఈ స్లీప్ అప్నియాను హోమియోపతి చికిత్సా విధానంతో నయం చేయవచ్చునని వారు చెబుతున్నారు.

ఈ వ్యాధిని తగ్గించాలంటే సైనసైటిస్, ఎడినాయిడ్స్, థైరాయిడ్ సమస్యల వల్ల ఎదురయ్యే స్లీప్ అప్నియాను తగ్గించాలంటే ఆయా జబ్బులకు సంబంధించిన మందులు వాడాల్సి ఉంటుంది. స్థూలకాయమే ఈ సమస్యకు కారణమైతే స్థూలకాయాన్ని తగ్గించడం తప్ప మరో దారి లేదు. శరీర తత్త్వాన్ని అనుసరించి ఇచ్చే హోమియో మందులు గురక, స్లీప్ అప్నియాలను నివారించడానికి చక్కగా తోడ్పడుతాయి.

పడుకోగానే గురక మొదలయ్యే వారికి సామమ్యూకస్ అనే మందును, మధ్యరాత్రి మొదలయ్యే గురకకు ఆర్సనిక్ ఆల్బ్ అనే మందును ఇస్తారని హోమియోపతి నిపుణులు పేర్కొంటున్నారు. తెల్లవారు జామున మూడు గంటలప్రాంతంలో మొదలయ్యే గురకకు క్యాలీకార్బ్ అనే మందు బాగా పనిచేస్తుందని వారు అంటున్నారు.

ఈ స్లీప్ అప్నియాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఆక్సిజన్ అవసరం కోసం కాస్త వ్యాయామ రీతిలో పనిచేయడం
ఆల్కహాల్‌ను సేవించడం నిలిపివేయడం
అతిగా భోజనం చేయడం
క్రొవ్వు పదార్థాలను తక్కువుగా తీసుకోవడం

స్లీప్ అప్నియా అంటే...

శరీరంలోని టాన్సిల్ సైనసైటిస్, రైనైటిస్ వంటి సమస్యలు గురకకు ప్రధాన కారణమవుతుంది. నిద్రలో దేహక్రియలన్నీ తమ సహజవేగాన్ని కోల్పోయి శ్వాస ఆడటంలో ఆటంకం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ ఎప్పటికీ ప్రమాదం. జీవ ప్రక్రియల వేగం పడిపోవడంతో శ్వాస మందగించి కొన్ని క్షణాల పాటు నిలిచిపోవడం ఈ అప్నియా లక్షణం. అయితే ఇది పెద్ద సమస్య కాదు. ఈ సమస్యతో రాత్రి నిద్ర కరువై పగటిపూట కునికి పాట్లు తీస్తుంటారు. ఈ అప్నియాతో కోపం, గుండెజబ్బులు, అసహనం, శరీరంలో కొలస్ట్రాల్ వల్ల ప్రాణాపాయం ఉండదు. అయితే రక్తనాళాల బలహీనత గుండెకు సంబంధించిన జబ్బులు మాత్రం ఉంటే ప్రాణాంతకంగా మారవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu