Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హోమియోపతీ పెరుగుతున్న ఆదరణ

హోమియోపతీ పెరుగుతున్న ఆదరణ
మాత్రలు, సూదులు... శస్త్ర చికత్సలతో జనం కాస్త విసెగెత్తిన సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా చిన్న నలత చేసినా అల్లోపతి డాక్టర్ల వద్దకు పరుగులు పెట్టావారు. హోమియో వైద్యాలయాలు వెలవెలబోయేవి. కానీ ఈ మధ్య కాలంలో ఆ వైద్యాలయాలు కూడా కాస్తంత రష్‌గానే కనిపిస్తున్నాయి.

ఆదరణ పెరిగిన ఈ వైద్యం చరిత్ర వివరాలు ఏమిటో చూద్దాం రండీ. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న వైద్య పద్ధతులలో హోమియోపతి కూడా ఒకటి. ప్రత్యేకించి భారతదేశంలో మంచి ఆదరణ కనిపిస్తోంది. మిగిలిన దేశాలలో మరెక్కడా పెద్దగా పట్టు లేదు. ఇంతగా ఈ పద్ధతి దరిదాపు రెండు వందల ఏళ్ళబట్టీ వాడుకలో ఉంది.

అయినా దీనిపై అపవాదు ఉండనే ఉన్నాయి. అందుకే వెనుకవరుసలోనే నిలిచింది. ఎటువంటి కాలుష్యం లేకుండా జరిపే ఈ విదానం వాస్తవానికి మంచి ఉపయోగం ఉంది. శాస్త్రీయమైన పునాదులు లేవనే నిందను హోమియో విధానం ఇప్పటికీ మోస్తోంది. వ్యాధి నయమైన వారి సంఘటనలు నిందలకు సవాలుగా నిలుస్తున్నాయి.

హోమియోపతీ అన్నది హోమోయిస్, పేథోస్ అనే రెండు గ్రీకు మాటల నుంచి పుట్టింది. ఈ రెండు మాటలను కలిపి హోమియోపతీ అన్నారు. ఒక పదార్థం ఏ బాధని కలిగిస్తుందో అదే పదార్ధాన్ని దానికి మందుగా వాడాలి అన్నది హోమియోపతీ మూల సూత్రం. 1755-1843 నాటి సేమ్యూల్ హానిమాన్ అనే జెర్మనీ దేశపు వైద్యుడు ఈ వైద్యపద్ధతిని కనిపెట్టారు.

ఆ రోజుల్లో వైద్యం అంటే నాటు పద్దతి. రోగానికి కారణం మలినపు రక్తం అనే నమ్మకంతో రోగి రక్తనాళాలని కోసి రక్తం ఓడ్చేసేవారు. దేహనిర్మాణశాస్త్రం, రోగనిర్ణయశాస్త్రం, రసాయనశాస్త్రం అప్పటికి ఇంకా బాగా పుంజుకోలేదు. కనుక అప్పటి వైద్య విధానాలలో హానిమాన్ కి లోపాలు కనిపించటం సహజం. ఈ లోపాలని సవరించటానికి ఆయన ఒక కొత్త పద్ధతిని కనిపెట్టాడు.

అయితే అల్లోపతి ఎదుట హోమియోపతీ దెబ్బతింటూనే వస్తోంది. ఎన్నో ఆటుపోట్లను ఇప్పటికీ ఎదుర్కుంటూనే ఉంది. ఇప్పుడిప్పుడే కాస్తంత తేరుకుని జనం మన్ననలు పొందుతోంది. చేదు మాత్రలను మింగడానికి తిరస్కరించే పిల్లల కోసమో జనం హోమియో వైద్యుల గడప తొక్కుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu