Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కార్తీక మాసం స్పెషల్: ఉసిరికాయ పులిహోర ఎలా చేయాలి..?

ఉసిరికాయల్లోకి గింజల్ని తొలగించి మిక్సీలో ముద్దలా చేసుకోవాలి. అన్నం వండి వార్చి.. పెద్ద ప్లేటులో వార్చుకోవాలి. ఆపై స్టౌ మీద బాణలి పెట్టి నూనె పోసి వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి, శెనగపప్పు, పల్లీలు, మినప్

కార్తీక మాసం స్పెషల్: ఉసిరికాయ పులిహోర ఎలా చేయాలి..?
, బుధవారం, 1 నవంబరు 2017 (14:52 IST)
కార్తీక మాసంలో దీపారాధన, తులసి పూజ, వనభోజనాలు, కార్తీక స్నానం వంటి నియమాలున్నాయి. ఉసిరికి కూడా కార్తీక మాసంలో  ప్రాధాన్యత ఇచ్చారు. ఉసిరి కాయ మీద వత్తిని వెలిగించడం, క్షీరాబ్ది ద్వాదశినాడు తులసితో పాటుగా ఉసిరిని కూడా పూజించడం, ఉసిరి చెట్టు నీడన వనభోజనాలు చేయడం, వీలైతే ఉసిరి నీడ పడుతున్న నీటిలో స్నానం చేయడం వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు. అలాంటి ఉసిరికాయతో కార్తీక మాసంలో వంటలు చేయడం.. వాటిని భుజించడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు దూరమవుతుంది. 
 
ఉసిరితో పులిహోర ఎలా చేయాలో చూద్దాం.. 
కావలసిన పదార్థాలు : 
ఉసిరికాయలు : ఆరు
ఉడికించిన రైస్: అర కేజీ
ఆవాలు : అరస్పూన్
శెనగపప్పు : 3 టీస్పూన్లు 
పల్లీలు : ఐదు స్పూన్లు 
ఎండు మిర్చి : ఆరు 
నూనె : నాలుగు టీస్పూన్ 
ఉప్పు : తగినంత. 
పంచదార: ఒక స్పూన్
మినప్పప్పు : ఒక టీస్పూన్ 
కరివేపాకు తరుగు : ఒక కప్పు 
 
తయారీ విధానం:  
ఉసిరికాయల్లోకి గింజల్ని తొలగించి మిక్సీలో ముద్దలా చేసుకోవాలి. అన్నం వండి వార్చి.. పెద్ద ప్లేటులో వార్చుకోవాలి. ఆపై స్టౌ మీద బాణలి పెట్టి నూనె పోసి వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి, శెనగపప్పు, పల్లీలు, మినప్పప్పులను వేసి ఎర్రగా వేయించాలి. అవి వేగాక ఉసిరి ముద్దను కూడా వేసి ఐదు నిమిషాలు వేయించాలి.

అందులో పసుపు, కరివేపాకు, నిలువుగా చిల్చిన పచ్చిమిర్చి లేదా ఎండు మిర్చి వేయాలి. ఈ మిశ్రమాన్ని వండి చల్లార్చి ఉంచిన అన్నంలో కలిపాలి. చివరగా పంచదార కూడా వేసి కలిపి ఓ గంటసేపు అలాగే ఉంచిన తరువాత తింటే చాలా రుచిగా, వెరైటీగా ఉండే పులిహోర సిద్ధమైనట్లే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్షాకాలమైతేనేం? చద్దన్నంలో కాస్త గంజి నీళ్లు కలుపుకుని తాగాల్సిందే...?