Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంట్లో దుర్వాసన వస్తుందా? అయితే, ఇలా చేయండి...

సాధారణంగా వర్షాకాలంలో ఇంట్లో దుర్వాసన వస్తుంటుంది. సూర్యరశ్మి లేకపోవడంతో నేలంతా చిత్తడిగా మారడం, ఎడతెరిపి లేకుండా వర్షపు చినుకులు పడుతుండటంతో ఇల్లు దుర్వాసన వస్తుంది. అయితే, ఈ దుర్వాసన పోగొట్టేందుకు చ

ఇంట్లో దుర్వాసన వస్తుందా? అయితే, ఇలా చేయండి...
, సోమవారం, 9 జులై 2018 (10:06 IST)
సాధారణంగా వర్షాకాలంలో ఇంట్లో దుర్వాసన వస్తుంటుంది. సూర్యరశ్మి లేకపోవడంతో నేలంతా చిత్తడిగా మారడం, ఎడతెరిపి లేకుండా వర్షపు చినుకులు పడుతుండటంతో ఇల్లు దుర్వాసన వస్తుంది. అయితే, ఈ దుర్వాసన పోగొట్టేందుకు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు.
 
* వర్షాకాలంలో వర్షం పడిన తర్వాత కిటీకీలు, తలుపులు మూయకండి. వాటిని వీలైనంత వరకు తెరిచే ఉంచండి. దీంతో ఇంట్లో ఉన్న దుర్వాసన దాదాపుగా తగ్గిపోతుంది. ఇలాచేస్తే సూర్యకిరణాలు నేరుగా ఇంట్లో పడతాయి. ఈ వెలుగు సూక్ష్మక్రిములను నశింపచేస్తుంది. బాత్రూం, వంటిట్లో నాణ్యమైన ఎగ్జాస్ట్ ఫ్యాన్స్‌ని విధిగా అమర్చాలి. 
 
* వంటింట్లో వాసనలు తొలగాలంటే కాసిన నీటిలో నిమ్మకాయ తొక్కలను వేసి మరిగించాలి. ఇవి ఇల్లంతా వ్యాపించి మంచి వాసనను ఇస్తాయి. వేడినీటిలో నారింజ తొక్కలను వేసి మరిగించండి. ఇల్లంతా నారింజ వాసనలతో గుభాళిస్తుంటుంది. 
 
* ఇంటిచుట్టూ బేకింగ్‌ పౌడర్‌ని జల్లితే ఈగలు ఇంట్లోకి రావు. అలాగే, మీకు నచ్చిన పెర్ఫ్యూమ్‌ను వెదజల్లితే మంచిది. 
 
* కార్పెట్లు వాసన రాకుండా వాటిని బేకింగ్‌ సొడా కలిపిన నీటిలో నానబెట్టి వాక్యూమ్‌ క్లీనర్‌తో శుభ్రపరచండి. దీంతో కార్పెట్ల నుంచి మగ్గిపోయిన వాసన రాదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏంట్రా జోక్ చేస్తున్నారా ఏంటీ..?