Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బొద్దింక‌లకు చెక్ పెట్టే దోసకాయ ముక్కలు.. ఎలా..?

బొద్దింక‌లకు చెక్ పెట్టే దోసకాయ ముక్కలు.. ఎలా..?
, శనివారం, 11 సెప్టెంబరు 2021 (18:45 IST)
ఇంట్లో బొద్దింక‌లతో ఇబ్బందులా.. అయితే ఈ టిప్స్ పాటించండి. చాలా మంది కాక్‌రోచ్ కిల్ల‌ర్స్‌ను స్ప్రే చేస్తుంటారు. నిజానికి వీటితో బొద్దింక‌లు చ‌నిపోయిన‌ప్ప‌టికీ వాటిని కెమిక‌ల్స్‌తో త‌యారు చేస్తారు క‌నుక‌.. ఆ కిల్ల‌ర్స్ మ‌న ఆరోగ్యానికి అంత మంచివి కావు. అందుకే సహజసిద్ధమైన పద్ధతులను ఇలా ఎంచుకోవచ్చు. 
 
బోరిక్ పౌడ‌ర్‌, చ‌క్కెర పొడి, మొక్క‌జొన్న పిండిల‌ను స‌మాన భాగాలుగా తీసుకుని బాగా క‌లిపి బొద్దింక‌లు వ‌చ్చే చోట ఉంచాలి. ఆ మిశ్ర‌మాన్ని తిన్న బొద్దింక‌లు వెంట‌నే చ‌నిపోతాయి. కిచెన్‌లో వీలైనంత వ‌ర‌కు మ‌నం తినే ఆహార ప‌దార్థాలు కింద ప‌డ‌కుండా చూసుకోవాలి. లేదంటే.. బొద్దింక‌లు వ‌చ్చేస్తాయి. అలాగే కిచెన్‌లో పాత్ర‌ల్ని ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేస్తూ వాటి ప్లేస్ మారుస్తూ ఉంటే బొద్దింక‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.
 
బొద్దింక‌లు సాధార‌ణంగా ప‌సుపు రంగుకు ఆక‌ర్షిత‌మ‌వుతాయ‌ట‌. క‌నుక కిచెన్‌లో ఆ రంగు ఉండ‌కుండా చూసుకోవాలి. పాత్ర‌లు కానీ, కూర‌గాయ‌లు కానీ, ఇత‌ర వ‌స్తువులు కానీ ఎల్లో క‌ల‌ర్ ఉన్న‌వి తీసేయాలి. దీంతో బొద్దింక‌లు కిచెన్ వైపు రాకుండా ఉంటాయి.
 
దోస‌కాయ ముక్క‌ల వాస‌న బొద్దింక‌ల‌కు ప‌డ‌దు. క‌నుక కిచెన్‌లో వాటిని అక్క‌డ‌క్క‌డ ఉంచితే బొద్దింక‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. బోరిక్ పౌడర్‌ను కిచెన్‌లో బొద్దింక‌లు వ‌చ్చే చోట చ‌ల్లితే.. అవి చ‌నిపోతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏ పండులో ఏమున్నదో తెలుసా?