Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వజ్రపు తునకలా మెరిసిపోతున్న భూమి... ఎలా?

earth - gem

వరుణ్

, ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (13:53 IST)
అగ్రరాజ్యం అమెరికా చంద్రమండలంపైకి తొలి ప్రైవేట్ ల్యాండ్ర నోవా-సిని పంపించింది. ప్రస్తుతం ఇది మార్గమధ్యలో ఉంది. ఈ నెల 15వ తేదీన కేప్ కానవెరాల్‌లోని కెన్నడీ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి ఫాల్కన్ 9 రాకెట్సలు ఈ ల్యాండర్‌ను అంతరిక్షంలోకి చేర్చాయి. అటు ల్యాండర్ చంద్రుడిపై దూసుకెళుతుంది. ఈ ప్రయాణంలో ఈ ల్యాండర్ తీసి పంపిన ఫోటోలను అమెరికా కంపెనీ ఇనిషియేటివ్ మెషిన్ (ఐఎం) తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. 
 
ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భూమి వజ్రపు తునకలా మెరిసిపోతూ కనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతరిక్షం నుంచి భూమి ఎలా కనిపిస్తుందనేది గతంలో చాలా ఫొటోలు చూసినా నోవా-సి పంపిన ఫొటోలు అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకుంటున్నారు. కాగా, నోవా-సి ల్యాండర్ ఈ నెల 22న చంద్రుడిపై దిగనుంది. 
 
అంతా అనుకున్నట్లు జరిగితే చంద్రుడిపై దిగిన తొలి ప్రైవేట్ ల్యాండర్‌గా నోవా-సి, తొలి కంపెనీగా ఇనిషియేటివ్ మెషిన్స్ చరిత్ర సృష్టిస్తాయి. అంతేకాదు, 1972 తర్వాత చంద్రుడిపైకి అమెరికా పంపిన తొలి ల్యాండర్‌‍గా ఇది రికార్డులకెక్కనుంది. చంద్రుడిపైకి మరోసారి మానవ సహిత వ్యోమనౌకలను పంపించాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆర్టెమిస్ మూన్ ప్రోగ్రామ్‌‍ను చేపట్టింది. ప్రస్తుతం పంపించిన నోవా- సి ల్యాండర్ ఈ ప్రాజెక్టులో తొలి అడుగు అని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళగిరికి వస్తే సొంతూరుకు వచ్చిన భావన కలుగుతుంది : నారా బ్రాహ్మణి