Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెక్‌డొనాల్డ్స్.. యువతి కాలర్ పట్టుకున్నాడు.. పిడిగుద్దులతో ఉతికేసింది..

మెక్‌డొనాల్డ్స్.. యువతి కాలర్ పట్టుకున్నాడు.. పిడిగుద్దులతో ఉతికేసింది..
, గురువారం, 3 జనవరి 2019 (17:16 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అనేకమంది మహిళలు తమపై జరుగుతున్న అకృత్యాలను ధీటుగా ఎదుర్కోలేక బలైపోతున్నారు. అయితే ఫ్లోరిడాలో ఓ మహిళ తనపై జరిగిన అన్యాయాన్ని ధీటుగా ఎదుర్కొంది. వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని మెక్‌డొనాల్డ్స్ ఔట్‌లెట్‌ రెస్టారెంట్‌కు ఓ వ్యక్తి వెళ్లాడు. ఆర్డర్ ఇచ్చాడు. రెండు స్ట్రాలు లేవని స్టాఫ్‌ను అడిగాడు. 
 
లాబీల్లో ప్లాస్టిక్ స్ట్రాలు ఇవ్వలేమంటూ డొనాల్డ్స్ ఎంప్లాయి చెప్పింది. అయినా ఆ వ్యక్తి వినకుండా.. క్యాషియర్‌ను తిట్టాడు. అంతేగాకుండా తనకు సర్వ్ చేస్తున్న యువతి కాలర్ పట్టుకుని లాగపోయాడు. అంతే.. ఆ యువతి వెంటనే తేరుకుని ఆ వ్యక్తిపై పిడిగుద్దుల వర్షం కురిపించింది. ఈ ఘటనను మెక్‌డొనాల్డ్స్ కస్టమర్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
అంతేగాకుండా తనపై దాడికి యత్నించిన వ్యక్తికి తగిన విధంగా బుద్ధి చెప్పిన యువతిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి యువతులు సమాజానికి కావాలని.. ఇలాంటి మహిళల్ని చూసి సమస్యలను ఎలా ఎదుర్కోవాలో కొందరు నేర్చుకుంటారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

18 మెట్లు ఎక్కలేదు.. ఇరుముడి లేనేలేదు.. అది నిజంగా అయ్యప్ప సన్నిధానమా?