Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శరణార్థులపై ఇంత కఠినమా.. ట్రంప్ సార్ ఆలోచించండి.. గుండెపేలినట్లైంది: మలాలా

అమెరికాలో శరణార్థుల సంఖ్యను తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయడంపై పాకిస్థానీ విద్యార్థి కార్యకర్త, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్‌ ఆవే

శరణార్థులపై ఇంత కఠినమా.. ట్రంప్ సార్ ఆలోచించండి.. గుండెపేలినట్లైంది: మలాలా
, శనివారం, 28 జనవరి 2017 (16:17 IST)
అమెరికాలో శరణార్థుల సంఖ్యను తగ్గించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయడంపై పాకిస్థానీ విద్యార్థి కార్యకర్త, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర దాడులకు అనంతరం కోలుకుని ప్రస్తుతం ఇంగ్లండ్‌లో నివసిస్తున్న మలాలా వలసలను నిరోధిస్తూ డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన కాసేపటికే స్పందించారు. ఈ పరిణామం కలచివేసిందని మలాలా వెల్లడించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో తన గుండెపేలినట్లైందని మలాలా వ్యాఖ్యానించింది. 
 
యుద్ధం, హింసలనుంచి తప్పించుకునేందుకు భార్యాబిడ్డలతో తలదాచుకునేందుకు అమెరికాకు వస్తున్న వారిని నిరోధించేందుకు తలుపులు మూసేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం బాధాకరమన్నారు. అశాంతి, అనిశ్చితత్వం రాజ్యమేలుతున్న ప్రస్తుత ప్రపంచంలో నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలు, కుటుంబాల పట్ల అమెరికా అధ్యక్షుడు ఇంత కఠినంగా వ్యవహరించడం సరికాదని, ఆయన నిర్ణయాన్ని పునరాలోచించాలని మలాలా కోరారు. నోబెల్ శాంతి బ‌హుమ‌తి అందుకున్న అతిపిన్న వ‌య‌సురాలిగా మాలాలా రికార్డు క్రియేట్ చేసింది. 2014లో కైలాశ్ స‌త్యార్థితో పాటు మాలాలా కూడా నోబెల్ శాంతి బ‌హుమ‌తిని అందుకున్న‌ సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనాన్ని మూర్ఖుల్ని చేసి డబ్బు గుంజేస్తా..? ఓ వ్యక్తి ప్రధాని కాలేదా?:: చౌదరి