Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చైనాలో మరో ప్రాణాంత జబ్బు.. భయపెడుతున్న వ్యాధి...

new virus
, గురువారం, 23 నవంబరు 2023 (10:55 IST)
ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని బలితీసుకున్న కొవిడ్ 19 వైరస్ చైనా దేశంలోని వ్యూహాన్ నగరం నుంచి వ్యాప్తి చెందింది. ఈ మహమ్మారి మిగిల్చిన విషాదం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న ఆ దేశాన్ని మరో ప్రాణంతక జబ్బు పట్టుకుంది. పాఠశాలలకు వెళుతున్న చిన్నారుల్లో అంతుచిక్కని న్యుమోనియా లక్షణాల బారిన పడుతున్నారు. ఈ విషయంపై ప్రపంచవ్యాప్తంగా వ్యాధులు వ్యాప్తిని పరిశీలించే ప్రోమెడ్ సంస్థ అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఓ నివేదికను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 
 
'బుధవారం ఉదయం అనారోగ్యానికి గురైన చిన్నారులతో బీజింగ్, లియనోనింగ్ ప్రాంతాల్లోని ఆస్పత్రులు నిండిపోయాయి. దగ్గు లేకపోయినా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, శ్వాససంబంధ ఇబ్బందులు, జ్వరం వంటి లక్షణాలతో చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీంతో ఈ అంతు చిక్కని న్యుమోనియా రకం వ్యాప్తి చెందకుండా పాఠశాలలను యాజమాన్యాలు తాత్కాలికంగా మూసివేశాయి' అని ప్రొమెడ్ సంస్థ ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేసింది. 
 
ఒకేసారి వందల మంది పిల్లలు అనారోగ్యానికి గురికావడం అసాధారణ విషయమని, ఈ జబ్బు ఎప్పుడు, ఎలా పుట్టుకొచ్చిందో స్పష్టత లేకపోయినా.. పాఠశాలలోనే వ్యాప్తి చెంది ఉండొచ్చని పేర్కొంది. పలువురు ఉపాధ్యాయులు కూడా ఈ ఇన్ఫెక్షన్ బారిన పడినట్లు వెల్లడించింది. ఇది కరోనాలాగా మరో మహమ్మారిగా మారే అవకాశాలపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని ప్రోమెడ్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. 
 
ఈ ఏడాది ప్రారంభంలో చైనా కరోనా నిబంధనలను ఎత్తివేసిందని, అప్పటి నుంచి తరచూ అంటువ్యాధులు ప్రబలుతున్నాయని తెలిపారు. రెండు రోజుల క్రితం ఆస్పత్రుల వద్ద చిన్నారులు, వారి కుటుంబ సభ్యులు క్యూ కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రుడా రా రాను కాపీ కొట్టిన బీఆర్ఎస్