Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విమానం 4 గంటలు ఆలస్యం.. ఆగ్రహంతో విమానం రెక్కపై ఎక్కిన ప్రయాణికుడు...

flight wing

వరుణ్

, సోమవారం, 29 జనవరి 2024 (14:57 IST)
మెక్సికో నగరంలో తాను ప్రయాణించాల్సిన ఓ విమానం నాలుగు గంటల పాటు ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆగ్రహించిన ఓ ప్రయాణికుడు... ఫ్లైట్ ఎమర్జెన్సీ డోర్ తెరిచి.. విమానం రెక్కపై ఎక్కి అటూఇటూ తిరుగుతూ చక్కర్లు కొట్టాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ షాకింగ్ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
గత గురువారం మెక్సికో సిటీలోని మెక్సికో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో పార్క్ చేసిన విమానం టేకాఫ్ కోసం వేచిచూస్తున్న సమయంలో 'ఏరోమెక్సికో' విమానంపై ప్రయాణికుడు ఈ విధంగా వ్యవహరించాడని బీబీసీ రిపోర్ట్ పేర్కొంది.
 
ఉదయం 08:50 గంటలకు బయలుదేరి 10:46 గంటలకు చేరుకోవాల్సిన విమానం దాదాపు 4 గంటలు గడిచినా బయలుదేరకపోవడంతో ప్రయాణికుడు అసహనానికి గురయ్యాడని రిపోర్ట్ పేర్కొంది. నిర్వహణ సమస్య కారణంగా విమానం ఆలస్యమైందని తెలిపింది. ఈ ఘటన కారణంగా విమానాన్ని మార్చాల్సి వచ్చిందని పేర్కొంది. 
 
ఎలాంటి హాని జరగకపోయినప్పటికీ నిందిత ప్రయాణికుడిని పోలీసులకు అప్పగించినట్టు మెక్సికో అంతర్జాతీయ విమాశ్రయం ప్రకటించింది. గ్వాటెమాలాకు వెళ్లాల్సిన విమానంలో ఒక ప్రయాణికుడు ఈ విధంగా వ్యవహరించాడని తెలిపింది. ఎలాంటి హాని చేయకుండా విమానం రెక్కపై నిలబడి తిరిగి క్యాబిన్‌లోకి ప్రవేశించాడని తెలిపింది. భద్రతా నిబంధనలకు అనుగుణంగా నిందిత వ్యక్తిని పోలీసు అధికారులకు అప్పగించామని వివరించింది.
 
కాగా నిందిత ప్రయాణికుడిని పోలీసులకు అప్పగించడంపై తోటి ప్రయాణికులు అభ్యంతరం తెలిపారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ రాతపూర్వక ప్రకటనపై సంతకాలు ఎయిర్ పోర్టు అధికారులకు అందించారు. అతడిని వెంటనే విడుదల చేయాలని విమానంలో 77 మంది ప్రయాణికులు డిమాండ్ చేశారు. కాగా నిందిత ప్రయాణికుడిని విమానాశ్రయ అధికారులు ఇంకా గుర్తించలేదు. అతడు పోలీసుల అదుపులో ఉన్నాదా లేదా తెలియాల్సి ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపాకు తొత్తులుగా వ్యవహించే పోలీసులపై కఠిన చర్యలు : నారా లోకేశ్