Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది : ఎలాన్ మస్క్

elon musk

వరుణ్

, గురువారం, 18 ఏప్రియల్ 2024 (10:32 IST)
అనేక ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా ఉన్న భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఆయన కోరారు. 
 
ఎలాన్ మస్క్ గత జనవరి నెలలో కూడా భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడం ఆశ్చర్యకరమన్నారు. బలమైన దేశాలు తమ అధికారాన్ని పంచుకునేందుకు సిద్ధంగా లేవంటూ వ్యాఖ్యానించారు. 'ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడోకప్పుడు సంస్కరణలు చేయకతప్పదు. సమస్య ఏంటంటే.. ప్రస్తుతం అధికారాలను అనుభవిస్తున్న దేశాలు వాటిని వదులుకోదలుచుకోలేదు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం వింతే. యావత్ ఆఫ్రికా ఖండానికి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలి' అని అన్నారు.
 
మరోవైపు, ఎలాన్ మస్క్ సూచనపై అగ్రరాజ్యం అమెరికా కూడా స్పందించారు. ఐక్యరాజ్యసమితిలో ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టాలని వ్యాఖ్యానించింది. తాజా మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 'అమెరికా అధ్యక్షుడు ఈ విషయమై గతంలో మాట్లాడారు. అమెరికా విదేశాంగ మంత్రి కూడా ఈ అంశాన్ని పేర్కొన్నారు. భద్రతామండలి సహా ఐక్యరాజ్య సమితి వ్యవస్థల్లో 21వ శాతాబ్దపు మార్పులను ప్రతిబింబించేలా సంస్కరణలకు మేము మద్దతు ఇస్తున్నాం. ఈ దిశగా తీసుకునే చర్యలపై ప్రస్తుతం నా వద్ద పూర్తి వివరాలు లేవు. అయితే, సంస్కరణల అవసరాన్ని మాత్రం అమెరికా గుర్తించింది' అని వేదాంత్ పటేల్ అన్నారు.
 
కాగా, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను మరింత మెరుగ్గా ప్రానిధ్యం వహించేందుకు తమకు భద్రతామండలి శాశ్వత సభ్యత్వం ఉండాలని భారత్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఈ వాదనకు అంతర్జాతీయంగా కూడా మద్దతు పెరుగుతోందని ఇటీవల భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా వ్యాఖ్యానించారు. మనకు కావాల్సినవి ప్రపంచం ఉదారంగా దానం చేయదని, వాటి కోసం పోరాడి తీసుకోవాల్సి వస్తుందని కూడా అన్నారు.
 
మరోవైపు, ప్రస్తుతం ఐక్యరాజ్యసమితిలో మొత్తం 15 సభ్య దేశాలు ఉన్నాయి. వీటిలో ఐదు శాశ్వత సభ్య దేశాలు కాగా, మిగతా 10 దేశాలను ఐక్యరాజ్య సమితి జనరల్ ఎంసెంబ్లీ.. రెండేళ్ల కాలపరిమితి చొప్పున భద్రతామండలికి ఎన్నుకుంటుంది. ప్రస్తుతం అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా, బ్రిటన్‌కు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రునిపై భారతీయుడు దిగే వరకు అది కొనసాగుతుంది.. ఇస్రో