Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అధ్యక్షుడిగా గెలిపించకుంటే రక్తపాతమే : డోనాల్డ్ ట్రంప్

donald trump

ఠాగూర్

, ఆదివారం, 17 మార్చి 2024 (12:26 IST)
వచ్చే ఎన్నికల్లో తనను అధ్యక్షుడిగా గెలిపించకుంటే దేశంలో రక్తపాతమే జరుగుతుందని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. శనివారం ఓహియో రాష్ట్రంలోని వాండాలియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ఈ హెచ్చరికలు చేశారు. ఈ యేడాది  నవంబరు నెలలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నిక అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైనదిగా నిలిచిపోనుందన్నారు. అధ్యక్ష భవనం 'వైట్ హౌస్'లో అడుగుపెట్టేందుకు తాను సాగిస్తున్న ప్రచారం దేశానికి కీలకమైన మలుపుగా మారబోతోందని అన్నారు.
 
'నవంబర్ 5వ తేదీని గుర్తుంచుకోండి. మన దేశ చరిత్రలో అత్యంత కీలకమైన తేదీ అని నేను భావిస్తున్నాను' అని అన్నారు. తన ప్రత్యర్థి అధ్యక్షుడు జో బైడెన్‌ను చెత్తగా ఆయన అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో తాను గెలవకపోతే రక్తపాతమే జరుగుతుందని ట్రంప్ హెచ్చరించారు. అయితే ఏ ఉద్దేశంతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారనేది స్పష్టత ఇవ్వలేదు.
 
మెక్సికోలో కార్లను తయారు చేసి వాటిని అమెరికన్లకు విక్రయించాలనుకుంటున్న చైనా ప్రణాళికలకు తాను చెక్ పెడతానని, అధ్యక్షుడిగా ఎన్నికైతే చైనా కార్లను ఇక్కడ విక్రయించబోనివ్వనని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో తాను గెలవకపోతే రక్తపాతం అవుతుందని, అయినప్పటికీ చైనా కార్లను అమెరికాలో అమ్మనివ్వనన్నారు. కాగా రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ దాదాపు ఖరారైన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వామ్మో... ఎన్నికల పోలింగ్‌కు అన్ని రోజులా...? అభ్యర్థుల్లో వెన్నులో వణుకు...!!