Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గౌతమీపుత్ర శాతకర్ణీ... బాలయ్య శకం మొదలవుతుందీ... ఇంటర్వ్యూ

సంక్రాంతికి సినిమాలు విడుదల కావడం.. అందులోనూ చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు విడుదలవ్వడం సీనిరంగంలో విశేషంగా చెప్పుకోవచ్చు. సహజంగా ప్రతి హీరోకు విడుదలకు ముందు టెన్షన్‌.. కాస్త భయం అనిపిస్తాయి. ఇదే విషయాన్ని బాలకృష్ణను అడిగితే.. భయమా! నాకా! ఏం.. ఎలా కన్పి

గౌతమీపుత్ర శాతకర్ణీ... బాలయ్య శకం మొదలవుతుందీ... ఇంటర్వ్యూ
, బుధవారం, 11 జనవరి 2017 (22:08 IST)
సంక్రాంతికి సినిమాలు విడుదల కావడం.. అందులోనూ చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు విడుదలవ్వడం సీనిరంగంలో విశేషంగా చెప్పుకోవచ్చు. సహజంగా ప్రతి హీరోకు విడుదలకు ముందు టెన్షన్‌.. కాస్త భయం అనిపిస్తాయి. ఇదే విషయాన్ని బాలకృష్ణను అడిగితే.. భయమా! నాకా! ఏం.. ఎలా కన్పిస్తున్నాను! అంటూ తనదైన శైలిలో సమాధానమిస్తూ... ప్రకృతే మా సినిమాకు సహకరించింది అనుకున్నట్లుగా ఇలాంటి చారిత్రాత్మక సినిమాను తీసేలా చేసింది. అదే మాకు ధైర్యం.. అంటూ.. నందమూరి బాలకృష్ణ తెలియజేశారు. గురువారమే విడుదల కానున్న ఈ చిత్రం గురించి ఆయన చెప్పిన విశేషాలు.
 
చారిత్రాత్మక చిత్రం కనుక యుద్ధాలు, గుర్రపుస్వారీ కోసం శిక్షణ తీసుకున్నారా?
గుర్రపు స్వారీ, కత్తి తిప్పడం లాంటివి నేనెప్పుడూ నేర్చుకోలేదు. ఆదిత్య 369, భైరవద్వీపం ఆ సమయంలో సినిమాకు అవసరం అంటే చేసేశా. అదే ఉత్సాహంతో ఇప్పుడూ ఈ సినిమాలో యుద్ధ సన్నివేశాల కోసం ఎలాంటి ట్రైనింగ్‌ తీసుకోలేదు. యాదృశ్చికంగా అలా వచ్చేసిదంతే. 'లెజెండ్‌' సినిమాలో కూడా గుర్రంపై వెళ్ళే సీన్‌ వుంది. దర్శకుడు సీన్‌ చెప్పగానే చేసేద్దాం అన్నాను. వెంటనే గుర్రం ఎక్కి స్వారీ చేశాం. ఏదో అదృశ్యశక్తి నడిపిస్తుందని భావిస్తాను. పైగా ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు నాన్నగారి సినిమాలు, ఎంజిఆర్‌, శివాజీగణేషన్‌ వంటి కొందరు అలా గుర్తుకు వస్తారంతే.. వారిని స్పూర్తిగా తీసుకుని చేసేస్తాను.
 
ఆంధ్ర రాజధాని అమరావతి అయ్యాక ఈ సినిమా చేయడంలో విశేషం వుందా?
అలాంటిది ఏమీలేదు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత అమరావతిని రాజధానిగా చేసుకున్నాం. అందుకే ఈ సినిమాను తీయలేదు. యాదృశ్చికంగా అలా కలిసి వచ్చింది. అప్పట్లో అమరావతి రాజుగా పాలించిన గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర చాలామందికి తెలియదు. పుస్తకాల్లో కొద్దిగా మాత్రమే వుంటుంది. ఈ సినిమాను నేను కథ నచ్చి చేయడానికి రెడీ అయ్యానే తప్ప కావాలని వందో సినిమాగా ప్లాన్‌ చేసింది కాదు. వందో సినిమా అంటే ప్రత్యేకంగా ఉండాలని చాలా కథలు విన్నా. అందులో క్రిష్‌ చెప్పిన ఈ కథ ఎందుకో విపరీతంగా నచ్చింది. తెలుగుజాతికి ఖ్యాతిని తెచ్చిన కానరాని భాస్కరుడే గౌతమిపుత్రశాతకర్ణి. అలాంటి ఒక గొప్ప వ్యక్తి కథ చెప్తున్నామన్న ఆలోచన కలగగానే వెంటనే ఒప్పేసుకున్నా.
 
దర్శకుడు పని విధానం?
తను చేసిన ఐదు చిత్రాలు దేనికవే భిన్నమైనవి. నా దగ్గరకు వచ్చిన దర్శకులు చాలామంది ఒకే రకమైన మూస కథలను పట్టుకొస్తూ ఉంటారు. క్రిష్‌ ఇలాంటి కొత్త కథను తీసుకురావడమే నాకు ఉత్సాహాన్నిచ్చింది. నన్నడిగితే ప్రఖ్యాత హాలీవుడ్‌ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌తో క్రిష్‌ను పోల్చవచ్చు. కథ విన్నాక కచ్చితంగా నా వందో సినిమా స్థాయికి తగ్గ సినిమా అనిపించింది. 2 గంటల 15 నిమిషాల్లో కథకు అవసరమయ్యే అన్ని అంశాలతో క్రిష్‌ ఒక గొప్ప సినిమా తీశాడు. సినిమాకు ఏది అవసరమో దాన్నే చెప్పడానికి అందరినీ ఒప్పించడంలో క్రిష్‌ చూపిన ప్రతిభ వల్లే ఇది సాధ్యమైందనుకుంటున్నా.
 
నిర్మాతలు ఏ మేరకు సహకరించారు?
సహజంగా ఇది పెద్ద బడ్జెట్‌ సినిమా. కోట్లు ఖర్చవుతాయి. ఆనాటి రాజుల దుస్తులు, డిజైన్లు, సెట్లు వేయాల్సి వుంటుంది. కొందరైతే ఆరంభంలో ఆపేస్తారు. మరికొందరు మధ్యలో ఆపేస్తారు. చివరివరకు వుండేది నిఖార్సయిన వారే. అలాంటి వారిలో ఈ చిత్ర నిర్మాతలు ఒకరు.
webdunia
 
మొరాకాలోని అనుభవాలు?
ఒక మంచి పనిచేస్తున్నపుడు పంచభూతాలన్నీ మనకు సహకరిస్తాయంటారు. అలా ఈ సినిమా షూటింగ్‌ జార్జియా, మొరాకో లాంటి ప్రాంతాల్లో చేసినప్పుడు కూడా మాకు ఏ ఇబ్బంది కలగలేదు. జార్జియాలో అయితే అంతటా వర్షం పడేది కానీ,  మా షూటింగ్‌ ప్రాంతం మాత్రం మామూలుగా ఉండేది. ఇవన్నీ మన పనికి సహకరించేవిగానే చెప్పుకోవచ్చు.
 
ఈ కథ ముందు విన్నారా?
నిజానికి కథతో నాన్నగారు సినిమా చేద్దామనుకున్నారు. కానీ ఆయన బిజీ అయిపోవడంతో ఆయన ఈ కథతో సినిమా చేయలేకపోయారు. ఓ రకంగా అలాంటి సినిమాలో నేను నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. శాతకర్ణి జీవితంలోని రకరకాల భావోద్వేగాలు ఎంతమందికి తెలుసు... ఇవన్నీ ఆలోచించడంతోనే నాకు చాలా ఉత్సాహం వచ్చేసింది. ఇలాంటి సినిమా చేయడం కూడా నాన్నగారు, అభిమానుల ఆశీర్వాదం అని కూడా అనుకుంటాను.
 
అప్పటి చరిత్ర పెద్దగా తెలీదు. దేన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు?
శాతకర్ణి పాత్రను చేయడానికి ఎలాంటి రెఫరెన్స్‌లు లేవు. అప్పటి కొన్ని శాసనాలు, చిత్రాలను ఆధారంగా చేసుకున్నాం. కథను బాగా తెలిసిన గుంటూరుకు చెందిన శాస్త్రి, శర్మలు రాసిన పుస్తకాలే ఆధారలు. తెలిసిన విషయాలు గ్రహించాం. ప్రస్తుతానికి వారు లేకపోయినా.. వారు చెప్పినట్లే చేయగలిగాం. అలాగే పాత్ర కోసం కసరత్తులు ఏమీ చేయలేదు. దర్శకుడు క్రిష్‌ గారి విజన్‌, నాన్నగారు కూడా ఈ సినిమా చేయాలనుకొని ఉండడం లాంటివన్నీ నన్ను ముందుకు నడిపించాయి. సినిమా చేస్తున్నంత కాలం నాన్నగారు ఎక్కడో ఓ అదృశ్య శక్తిలా నన్ను నడిపించారని అనిపిస్తూంటుంది. బహుశా ఆయన ప్రేరణ లేకపోతే ఈ సినిమా ఇంత సులువుగా చేయగలిగేవాడిని కాదేమో. 
 
హేమామాలిని, కబీర్‌బేడి నటించడం ఎలా అనిపించింది?
హేమామాలిని లాంటి గొప్ప నటి మా సినిమాలో నటించారు. నాన్నగారి చేసిన 'పాండవ వనవాసం'లో చేశారు. మళ్ళీ ఇన్నేళ్ళకు తెలుగులో ఒక బలమైన పాత్రతో మెప్పించనున్నారు. కబీర్‌ బేడి కూడా విలన్‌గా చాలా బాగా చేశారు. ఆయన మొదట నర్వెస్‌గా ఫీలయ్యారు. మొదటి డైలాగ్‌.. సమయంలేదు మిత్రమా! మరణమా.. శరమణా.. అంటూ నేను డైలాగ్‌ చెప్పేసరికి.. ఆయన భయపడిపోయారు.. వెంటనే దానికి కౌంటర్‌ చెప్పలేకపోయారు. దర్శకుడిని అడిగి.. రూమ్‌కు వెళ్ళిపోయారు.. డైలాగ్‌లు ప్రాక్టీస్‌ చేసి తర్వాత రోజు వచ్చారు. రాత్రంతా నేనే గుర్తుకువస్తున్నాని చెప్పారు. ఆ ఆవేశంతోకూడి డైలాగ్‌ తను చెప్పలేకపోయాననే బాధపడ్డారు. ఎంత సీనియర్‌ అయినా ఒక్కోసారి అలానే వుంటుంది.
 
చిరంజీవి, మీ సినిమాలు పోటీగా వస్తున్నాయి?
అవును. సంక్రాంతి పండుగకు సినిమాల మధ్య పోటీ ఉండటం అనేది ఇప్పుడు కాదు. ఈ పోటీ ఎప్పటి నుండో ఉంటున్నదే. పోటీ లేకపోతే చప్పగా వుంటుంది. నా ఫ్యాన్స్‌తో పాటు చాలామంది అభిమానులు నా సినిమాలు చూడాలనే ఉత్సాహంలో వుంటారు. ఇక చిరంజీవి గారి సినిమా డిఫరెంట్‌.. రెండూ వేటికవే ప్రతిష్టాత్మకమైనవి. రెండు సినిమాలూ విజయం సాధించాలని కోరుకుంటున్నా.
 
'రైతు' సినిమా ఎంతవరకు వచ్చింది?
కష్ణవంశీతో 'రైతు' సినిమా విషయమై చర్చలు జరుగుతున్నాయి. దానికోసం అమితాబ్‌ను కలిసి స్టోరీ నేనే చెప్పాను. నా స్టైల్‌లో చెప్పేసరికి ఆయన ఆశ్చర్యపోయారు. తప్పకుండా చేస్తానన్నారు. ఇంకా డేట్స్‌ ఇవ్వలేదు. ఆయన ఇస్తే.. తప్పకుండా సినిమా వుంటుంది.
 
కొత్త సినిమాలు ఎలా వుండాలనే ఆలోచన వుందా?
100వ సినిమా తర్వాత కెరీర్‌ను ప్రత్యేకంగా ప్లాన్‌ చేయాలనుకుంటున్నాను. ఈ క్రమంలోనే ఇకపై వచ్చే నా సినిమాల్లో కొత్త బాలకృష్ణను చూస్తారు. ఇకనుంచి బాలకృష్ణ శకం మొదలవుతుందని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

18 ఏళ్ళకే బాలకృష్ణతో నటించా: బాలయ్య హీరోయిన్ శ్రియ గారాలు, ఇంటర్వ్యూ