Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిరంజీవి ఇన్‌వాల్వ్‌మెంటులో లాజిక్‌ వుంటుంది.. ఠాగూర్‌ + రౌడీఅల్లుడు= 'ఖైదీ నెం.150': వివి వినాయక్‌

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెం.150' సినిమా గురించి ఫ్యాన్స్‌లోనూ, బయటా రకరకాల ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వాటిని సరిగ్గా చెప్పేందుకు ఇంకా చిత్ర టీమ్‌ సిద్ధంకాలేదు. ఈమధ్యనే బాలయ్య, చిరంజీవి ఫ్యాన్స

చిరంజీవి ఇన్‌వాల్వ్‌మెంటులో లాజిక్‌ వుంటుంది.. ఠాగూర్‌ + రౌడీఅల్లుడు= 'ఖైదీ నెం.150': వివి వినాయక్‌
, శనివారం, 31 డిశెంబరు 2016 (15:41 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెం.150' సినిమా గురించి ఫ్యాన్స్‌లోనూ, బయటా రకరకాల ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వాటిని సరిగ్గా చెప్పేందుకు ఇంకా చిత్ర టీమ్‌ సిద్ధంకాలేదు. ఈమధ్యనే బాలయ్య, చిరంజీవి ఫ్యాన్స్‌ ఒకరి సినిమాపై ఒకరు కామెంట్లు చేసుకోవడంతో దానికి నాగబాబు యూట్యూబ్‌లో క్లారిఫై ఇచ్చారు. 
 
మరి సినిమా గురించి దర్శకుడు వి.వి. వినాయక్‌ ఏమన్నాడు? చిరంజీవికే కథ ఎందుకు చెపాల్సి వచ్చింది? చిరంజీవి దర్శకత్వంలో ఇన్‌వాల్వ్‌మెంటుదా? స్క్రిన్ట్‌ విషయంలో ఏఏ జాగ్రత్తలు తీసుకోమని చెబుతారు? అసలు 'కత్తి' రీమేక్‌ ఎందుకు చేయాల్సివచ్చింది? సంక్రాంతికి ఎందుకు రిలీజ్‌ చేస్తున్నారు? ఫ్యాన్స్‌ మధ్య పోటీ రాదా? బ్రహ్మానందాన్ని కావాలని ఎందుకు చిరు అడిగారు? ఇలాంటి ప్రశ్నలకు కొత్త యేడాది సందర్భంగా వినాయక్‌ ఇచ్చిన సమాధానాలు వెబ్‌దునియా కోసం.
 
* చిరంజీవితో సినిమా చేయడానికి ఎలా ఆరంభమైంది?
నేను ఆయనతో సినిమా కోసం ఓ కథను చెప్పాను. 5 నిముషాల టైమ్‌ ఇచ్చారు. తర్వాత గంటకుపైగా విన్నారు. ఆ తర్వాత కొద్దిరోజులకు నన్ను పిలిచి తమిళ చిత్రం 'కత్తి' చూడమన్నారు. చూశాక బాగా నచ్చింది. దాన్నే ఎందుకు చేయకూడదు? అని నన్ను అడిగారు. అందులో ఆయనకు కావాల్సిన అన్ని అంశాలున్నాయి. నేను ఓకే అన్నాను.
 
* రీమేక్‌ వల్ల ఫ్యాన్స్‌ నిరాశకు గురవ్వరా?
రీమేక్‌ సినిమా చేస్తే నిరాశపడతారని నేను అనుకోను. ఇది ఈరోజు మొదలైన కల్చర్‌ కాదు. ఎప్పటి నుంచో రీమేక్‌ చేస్తూనే ఉన్నాం. సినిమా తీయాలనే చిరంజీవి దాదాపు 50, 60 కథలు విన్నారట.. అందులో అన్ని ఎలిమెంట్స్‌ ఉన్న కథ కావాలని చూస్తారు. 9 ఏళ్ళ క్రితం కూడా ఆయన ఆచితూచి... ఆఖరికి 'ఠాగూర్‌' రీమేక్‌ చేశారు. దానితో బిజినెస్‌పరంగా పెద్ద రేంజ్‌కు వెళ్ళారు. అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.
 
* కాజల్‌నే ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది?
ముందుగా అనుష్క అనుకున్నాం. తను చాలా బిజీగా ఉంది. ఇంకెవరు అని ఆలోచిస్తుండగా.. ఆఖరికి కాజల్‌ సరిపోతుందనిపించింది. తను ఈ సినిమా కోసం మరో సినిమాను వదులుకుని మరీ వచ్చింది.
 
* బడ్జెట్‌ ఎక్కువయిందనిపించిందా?
బడ్జెట్‌ ఎక్కువయిందని నేను అనుకోను. కథ చెప్పాక. నిర్మాత ఇంత అవుతుందని చూసుకుంటారు. ఎవరు ఎంత తీసుకుంటున్నారు.. అనేది కూడా నేను పట్టించుకోను. బడ్జెట్‌ పని నిర్మాతదే.. మేం చెప్పిన కథను చూసుకోవాల్సింది నిర్మాతే. ఇంత అని చెబితే.. దాన్ని బట్టి.. సినిమా చేస్తాను. బడ్జెట్‌ ఇంత అని నేను చెప్పలేదు. వేస్టేజ్‌ జరగలేదు. ఏది అడిగితే అది సమకూర్చారు రామ్‌ చరణ్‌.
 
* చరణ్‌తోపాటు మిగిలిన ఫ్యామిలీ మెంబర్లు నటించారా?
చరణ్‌ మాత్రమే ఓ సాంగ్‌లో కన్పిస్తారు.
 
* సీక్వెల్స్‌ చేసే ఆలోచన వుందా?
150కు సీక్వెల్స్‌ వుండదు. కానీ.. ఎప్పటినుంచో తారక్‌ 'అదుర్స్‌ 2' చేద్దామని అంటున్నాడు. నేను ప్రయాణాల్లో ఉండగా పలువురు ఇదే అడుగుతుంటారు. కానీ అలాంటి కథ మళ్ళీ రాయడం కష్టం. అందుకే ప్రయత్నాలు చేయలేదు.
 
* పాటలకు ఎలాంటి రెస్సాన్స్‌ వచ్చింది?
ఊహించని రెస్సాన్స్‌ వచ్చింది. చిరంజీవి సినిమాలో సాంగ్‌ కోసం సాంగ్‌ పెడతారు. ప్రతి సాంగ్‌ ఇంట్రస్ట్‌గా ఉంటుంది. అయితే ఎక్కువ పాటలుంటే బోర్‌ కొడుతుంది. అందుకే 4 పాటలే ఇందులో పెట్టాం. అవి కూడా మంచి సన్నివేశపరంగా ఇక్కడ సాంగ్‌ ఉంటే బాగుంటనిపించేలా వుంటాయి.
 
* యాక్షన్‌‌పరంగా ఎలా వుంది?
ఇందులో 3 ఫైట్లు ఉన్నాయి. అవికూడా ప్రేక్షకుడు ఇన్‌వాల్వ్‌ అయ్యేట్లుగా వుంటాయి. రీమేక్‌ చేయడానికి ఇది కూడా ఓ కారణం.
 
* బ్రహ్మానందం ఉన్నారా?
ఉన్నారు. బ్రహ్మానందాన్ని కావాలని చిరంజీవిగారే కోరారు. ఆయనతో మంచి ఎటాచ్‌మెంట్‌వుంది.
 
* చరణ్‌ చేసిన 'ధృవ' ఎలా అనిపించింది?
చరణ్‌ చేసిన సినిమాల్లో ఇది కొత్తగా ప్రయత్నించాడు. ఆ సినిమా చేస్తుండగా. తెలీని ఒత్తిడిలో ఉండేవాడు. 
 
* ఖైదీ నెం. 150 గురించి ఒక్కముక్కలో ఎలా చెప్పగలరు?
'ఠాగూర్‌'లో ఉండే నిజాయితీ వుంటుంది. చిరంజీవి తాలూకు 'రౌడీ అల్లుడు' ఫన్‌ వుంటుంది. సాంగ్స్‌ బాగున్నాయి. బాగుందని మళ్లీ చూడాలనిపించేలా సినిమా వుంటుంది.
 
* 9 ఏళ్ళ తర్వాత వస్తున్న చిరంజీవిలో మార్పు కన్పించిందా?
ఆయన సినిమాలు బ్రేక్‌ చేసిన దానికంటే ఇప్పుడు బాగున్నారు. 'చూడాలనివుంది'లో ఎలా వున్నారో అలా వున్నారు. డాన్స్‌ వేస్తున్నా.. సునాయాసంగా చేసేస్తున్నారు. కామెడీ టైమింగ్‌ కూడా అంతే.
 
* ఇంకా కామెడీ ఆర్టిస్టులు ఎవరెవరున్నారు?
అలీ, బ్రహ్మానందం, రఘుబాబు ఉన్నారు. అలీ 'ఆది' సినిమాలో ఫుల్‌లెంగ్త్‌ పాత్ర చేశారు. మళ్ళీ ఇప్పుడు. హీరోకు ఫ్రెండ్‌గా చేశాడు.
 
* కొత్తవారు చాలామంది వున్నారటగా?
ఓ సన్నివేశపరంగా కొందరు కావాలి. అందుకే మార్నింగ్‌వాక్‌లోనూ ఓల్డేజ్‌ మోమ్‌లో కొంతమందిని ఎంపిక చేశాం. దాదాపు 200 మందిని ఆడిషన్‌ చేసి.. 100 మందిని తీసుకున్నాం. చిరంజీవి చూడానే. వారంతా సర్‌ప్రైజ్‌తో కూడిన భయంతో ఉండేవారు. ఆ సన్నివేశానికి అలా వుండాలని తీసుకున్నాం.
 
* సంక్రాంతికి పోటీ అని బయట అనుకుంటున్నారు?
అలాంటిది ఏమీలేదు. ఎన్ని సినిమాలు విడుదలైనా జనాలు చూస్తారు. సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. అన్నీ సినిమాలు బాగుంటాయి.
 
* తండ్రీకొడుకులు రీమేక్‌లు తీసుకున్నారే?
సినిమాకు కావాల్సింది హిట్‌. అది ఎక్కడవుంటుందో దాన్ని ఫాలో అవుతారు. మన పోకిరి తమిళంలో పెద్ద హిట్‌. అలానే మనం తీసుకోవాల్సివుంటుంది.
 
* ఇందులో మీరు నటించారా?
ఒరిజినల్‌ 'కత్తి'లో మురుగదాస్‌ ఓ సీన్‌ చేశారు. నేనూ అదే సీన్‌లో వున్నా.
 
* 2016లో మీకు నచ్చిన సినిమాలు?
అలా ఎలా చెప్పగలం. అన్ని సినిమాలు బాగా తీశారు. ఆనందంగా సినిమా ఇండస్ట్రీ వుంది.
 
* మరలా ఎవరితో సినిమా చేయబోతున్నారు?
ముందు కథ రాసుకుంటాను. దానికి తగ్గ హీరో ఎవరనేది చూస్తాను. అంతేకానీ.. ఏదీ ప్లాన్‌ చేసుకుని రెండేళ్ళు మూడేళ్ళు చేయను. 150వ సినిమాను 87 రోజుల్లోనే తీసేశాం.
 
* 150వ సినిమా మీరు చేయకపోతే ఎవరు చేస్తే బాగుంటుందని అనిపించేది?
అది నేను చెప్పలేను. నాకు అవకాశం వచ్చింది.
 
* మీ సినిమాల్లో వేణుమాధవ్‌, ఎం.ఎస్‌. వంటివారు వుండేవారుకదా ఆ జర్నీ ఎలా అనిపించింది?
 
'దిల్‌' సినిమా నుంచి వేనుమాధవ్‌ వున్నాడు. ఎం.ఎస్‌. నటుడుకాక ముందునుంచి రచయితగా పరిచయం. నేను అసిస్టెంట్‌గా పనిచేసినప్పటి నుంచి ఆయనతో చనువు వుండేది. ఆయన నటుడు అయ్యాక అన్ని సినిమాల్లో తీసుకున్నాను. ఎల్‌బిశ్రీరామ్‌ నాకు గురువు. ఆయన రచయిత. రాసింది చెప్పలేరు. ఆయన దగ్గర చాలా చిత్రాలకు పనిచేశాను. ఫెయిర్‌ కాపీ నాతో చెప్పించుకునేవారు. నన్నంటే ఇష్టపడేవారు. నేను ఆయన దగ్గర ఇతర సినిమాలకూ పనిచేశాను.
 
* ప్రభాష్‌, వెంకటేస్‌ ఎవరితో చేయాలనుంది?
ప్రభాస్‌తో.
 
* అఖిల్‌తో సినిమా వుందా?
అఖిల్‌కు హిట్‌ సినిమా చేయాల్సిన బాధ్యత వుంది. చేస్తాను.
 
* సినిమాలో చిరంజీవి ఇన్‌వాల్వ్‌మెంట్‌ వుంటుందా?
స్క్రిప్ట్‌లో ఒక్కోసారి ఆయన అభిప్రాయం చెబుతారు. అలా అడిగితే దానికి లాజిక్‌వుంటుంది.. అది ఎలా వుంటే బాగుంటుందో అని ఐడియా కూడా వుంటుంది. అలా కాదని.. ఇలా అని మనం చెప్పినా.. నచ్చితే వద్దనే మనసత్త్వంకాదు. నిర్మాతల సమస్యగా ఏది వెళ్ళినా.. సాల్వ్‌ చేయడానికి ఆయన పెద్దగా వుంటారు. నా నిర్ణయమే జరగాలనే పట్టుదలకు పోరు. ఓ విషయాన్ని అందరితో చర్చిస్తారు. ముఖ్యంగా రచయతలు, డైరెక్టర్‌టీమ్‌, నిర్మాతలతో చర్చిస్తారు అని తన ఇంటర్వ్యూను ముగించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కాటమరాయుడు' కొత్త లుక్ రిలీజ్... సంక్రాంతికి టీజర్ విడుదల