Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

#CSKvsSRH ఐపీఎల్ ఫైనల్.. రషీద్ ఖాన్‌తో సీఎస్‌కే‌కు కష్టాలే.. అయినా ఫేవరేట్?

చెన్నై ఫేవరెట్ జట్టే అయినా.. సన్‌రైజర్స్ తరపున రషీద్ ఖాన్ ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపిస్తాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించే రషీద్ ఖాన్‌తో చెన్నై జట్టుకు కష్టాలే. ఎందుకంటే కేకేఆర్ జట్టుతో

#CSKvsSRH ఐపీఎల్ ఫైనల్.. రషీద్ ఖాన్‌తో సీఎస్‌కే‌కు కష్టాలే.. అయినా ఫేవరేట్?
, శనివారం, 26 మే 2018 (17:28 IST)
ఐపీఎల్ 11 ఫైనల్ మ్యాచ్ ఆదివారం నాడు జరుగబోతోంది. ఈ మ్యాచ్ పైన ఉత్కంఠ నెలకొని వుంది. ఈ నేపధ్యంలో మ్యాచ్ గురించి, ఇతర ఆసక్తి విషయాలు గురించి చూద్దాం. 
 
మ్యాచ్ ఆదివారం, మే 27న జరుగుతోంది.
వేదిక: వాఖండే స్టేడియం, ముంబై 
మ్యాచ్ ప్రారంభ సమయం: రాత్రి ఏడు గంటలకు 
భారత్‌లో స్టార్ స్పోర్ట్స్‌ లేదా హాట్ స్టార్ (డిజిటల్)లో ఈ మ్యాచ్‌ను వీక్షించవచ్చు. 
యూకేలో స్కై స్పోర్ట్స్‌‌లో 
ఆస్ట్రేలియాలో ఫాక్స్ స్పోర్ట్స్‌లో
దక్షిణాఫ్రికాలో సూపర్ స్పోర్ట్స్
 
చెన్నై సూపర్ కింగ్స్- హైదరాబాద్ జట్ల మధ్య ఫైనల్ పోరు
ఈ రెండు జట్లు ఐపీఎల్-11వ సీజన్‌ లీగ్ దశలో చెరో తొమ్మిది మ్యాచ్‌లు గెలిచాయి. 
అయితే ఐపీఎల్ జాబితా పట్టికలో సన్‌రైజర్స్ జట్టు రన్ రేట్ పరంగా అగ్రస్థానంలో వుంది.  
 
ఫేవరేట్స్ స్టార్స్ ఎవరంటే?
చెన్నై సూపర్ కింగ్స్.. తరపున టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత సీఎస్‌కే కెప్టెన్ ధోనీ వున్నాడు. ధోనీకి ఇది ఎనిమిదో ఐపీఎల్ ఫైనల్. ఈసారి కూడా చెన్నై జట్టును గెలిపించేందుకు ధోనీ విశ్వప్రయత్నాలు చేస్తాడు. 
webdunia
 
అయితే రషీద్ ఖాన్‌తో సీఎస్‌కేకు కష్టాలే.. 
కానీ చెన్నై ఫేవరెట్ జట్టే అయినా.. సన్‌రైజర్స్ తరపున రషీద్ ఖాన్ ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపిస్తాడు. బౌలింగ్, బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించే రషీద్ ఖాన్‌తో చెన్నై జట్టుకు కష్టాలే. ఎందుకంటే కేకేఆర్ జట్టుతో ఆడిన మ్యాచ్‌లో రషీద్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక మూడు సీజన్లలో ఆడుతున్న సన్‌రైజర్స్‌‌కు ఇది రెండో ఫైనల్. ఈ మ్యాచ్‌ రాత్రి ఏడు గంటలకు ప్రారంభమవుతుంది. వాంఖడే స్టేడియం బౌండరీలకు అనుకూలం కావడంతో కెప్టెన్లు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకునే ఆస్కారం వుంది. 
 
సీఎస్‌కే తొలి క్వాలిఫైతో ఫైనల్లోకి అడుగుపెట్టింది. సన్‌రైజర్స్ కేకేఆర్‌పై నెగ్గి ఫైనల్లోకి ప్రవేశించింది. ఇంతకుముందు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌పై నెగ్గిన అనుభవం సీఎస్‌కేకు వుంది. అయితే ఈ స్టేడియంలో పరుగుల వరద పారడం కష్టమే. టార్గెట్ 160 పరుగులకు మించవని టాక్. ఈ లక్ష్యాన్ని చేధించిన జట్టే విజేతగా నిలవడం ఖాయం. 
webdunia
 
ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్.. సన్‌రైజర్స్‌‌తో ఇదే వాంఖడే స్టేడియంలో ఆడిన మ్యాచ్‌లో 140 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఆటగాడు డు ప్లెసిస్ 67 పరుగులు సాధించి జట్టును గెలిపించాడు. దీనిని బట్టి సన్‌రైజర్స్‌పై చెన్నై నెగ్గే అవకాశం వుంది. అయినా హైదరాబాద్ జట్టులో మెరుగ్గా ఆడే ఆటగాళ్లుండటంతో ఐపీఎల్-11 సీజన్ ఫైనల్ పోరు ఉత్కంఠగా, ఆసక్తికరంగా, హోరాహోరీగా జరిగే ఛాన్సుందని క్రీడా పండితులు జోస్యం చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2018 : ఆ సెంటిమెంట్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌కు పునరావృతం చేసేనా?