Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫ్లిఫ్‌కార్ట్ సరికొత్త రికార్డ్.. ఒక్కరోజులో 30లక్షల స్మార్ట్‌ఫోన్లు సేల్

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ రికార్డు సృష్టించింది. స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో కొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత రిటైల్‌ మార్కెట్‌ చరిత్రలోనే ఒక్కరోజులో అత్యధికంగా ఫోన్ల అమ్మ

ఫ్లిఫ్‌కార్ట్ సరికొత్త రికార్డ్.. ఒక్కరోజులో 30లక్షల స్మార్ట్‌ఫోన్లు సేల్
, శుక్రవారం, 12 అక్టోబరు 2018 (15:06 IST)
ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ రికార్డు సృష్టించింది. స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో కొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత రిటైల్‌ మార్కెట్‌ చరిత్రలోనే ఒక్కరోజులో అత్యధికంగా ఫోన్ల అమ్మకాలు చేపట్టిన సంస్థగా ఫ్లిఫ్ కార్ట్ అవతరించింది. దసరా పండగ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డే సేల్‌ను నిర్వహిస్తోంది. 
 
ఈ ఆఫర్ ఈ నెల పదో తేదీన వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌ 10-14 తేదీ వరకు బిగ్‌ బిలియన్‌ డే పేరిట ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌ అత్యధికంగా డిస్కౌంట్‌ను, క్యాష్‌బ్యాక్‌ను ప్రకటించింది. పండగ సేల్‌ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌ 30వేల మందికి తాత్కాలిక ఉద్యోగాలను కూడా కల్పించింది. 
 
ఈ నేఫథ్యంలో ఈ సేల్ ప్రారంభమైన తొలి రోజునే కంపెనీల స్మార్ట్ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇందులో భాగంగా తొలి గంటలో సుమారు పది లక్షల ఫోన్లు అమ్ముడుపోయాయి. ఒక్కరోజులో 30లక్షల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడుపోయినట్లు ఫ్లిప్‌కార్ట్‌ సీనియర్‌ డైరెక్టర్‌ స్మృతి రవిచంద్రన్‌ ప్రకటించారు. 
 
భారత రిటైల్‌ మార్కెట్‌ చరిత్రలో ఒక్కరోజులోనే అత్యధిక స్మార్ట్‌ఫోన్లు అమ్మినట్లు స్మృతి రవిచంద్రన్ తెలిపారు. రియల్‌మి, షామీ, శాంసంగ్‌, నోకియా, ఆసుస్‌, ఇన్ఫినిక్స్‌, హానర్‌ కంపెనీలకు చెందిన స్మార్ట్‌ఫోన్లు అత్యధికంగా అమ్ముడుపోయాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజూ గుడికెళ్లే యువతి.. కన్నేసిన 65 ఏళ్ల పూజారి.. తల్లిని చేశాడు..