Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇక షియోమీ స్మార్ట్ టీవీలు.. అతి తక్కువ ధరకే...

అధునాతన టెక్నాలజీతో వివిధ రకాల గృహోపకరణ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తుపరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కోవలో చైనాకు చెందిన షియోమీ రెడ్మీ అత్యాధునిక ఫీచర్లతో అతి తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లను భారత మా

ఇక షియోమీ స్మార్ట్ టీవీలు.. అతి తక్కువ ధరకే...
, గురువారం, 25 జనవరి 2018 (17:13 IST)
అధునాతన టెక్నాలజీతో వివిధ రకాల గృహోపకరణ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తుపరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ కోవలో చైనాకు చెందిన షియోమీ రెడ్మీ అత్యాధునిక ఫీచర్లతో అతి తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్‌లోకి తెచ్చింది. ఈ ఫోన్లు ఎంఐ పేరుతో కుప్ప తెప్పలుగా సేల్ అవుతున్నాయి. ఫలితంగా ఇపుడు దేశవ్యాప్తంగా ఎంఐ ఫోన్ల హవా నడుస్తోందని చెప్పొచ్చు. 
 
ఇందుకోసం దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియోతో జట్టు కట్టనుంది. త్వరలో ఇండియాలోకి తీసుకురానున్న షియోమీ 50 అంగుళాల టీవీలను జియో రిటైల్‌ స్టోర్లలో లాంచ్‌ చేసేందుకు సిధ్ధమైంది. రెండు సంస్థల మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటివరకు లక్షల్లో ధరలు పలికే ఎల్.సి.డి, లెడ్ టీవీలను.. ఇకపై రూ.వేలల్లోనే అందించనున్నట్లు సమాచారం. 
 
ఈ టీవీలు మరికొన్ని నెలల్లోనే రిలయన్స్‌ జియో డిజిటల్‌ స్టోర్స్‌లలో విక్రయానికి ఉంచనుంది. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను కొల్లగొట్టేందుకు ఉపయోగించిన ఎత్తుగడలనే టీవీ మార్కెట్‌పై కూడా ప్రయోగించనుంది. శాంసంగ్‌, ఎల్‌జీ, సోనీ వంటి దిగ్గజ సంస‍్థల ధరలతో పోలిస్తే తక్కువ ధరలకే ఫీచర్‌, రిచ్‌, హై ఎండ్‌ టీవీలను అందుబాటులోకి తేవాలనే వ్యూహంతో రిలయన్స్ జియోతో షియోమీ ఓ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాన్నా ఎందుకలా చేశారు? మోహన్ బాబుతో మంచులక్ష్మి...