Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విజయవంతంగా వెబ్‌దునియా #LocWorld38 సీటెల్ సదస్సు

విజయవంతంగా వెబ్‌దునియా #LocWorld38 సీటెల్ సదస్సు
, గురువారం, 18 అక్టోబరు 2018 (12:30 IST)
ఎల్వోసి వరల్డ్ 38 సీటెల్, బూత్ 102# వద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ వెబ్‌దునియా ఓ సదస్సును నిర్వహించింది. ఈ ఈవెంట్లో వెబ్ దునియా టెక్నికల్, లోకలైజేషన్ రంగాలకు చెందిన అనేక మంది నిపుణులు పాల్గొని తమ సాఫ్ట్‌వేర్, లోకలైజేషన్ సేవల విధి విధానాలను వివరించారు. 
 
ముఖ్యంగా, CMMi Level 3 పరిపక్వమైన స్థాయితో ప్రపంచ సంస్థలు, ప్రాసెస్ అసెస్‌మెంట్లతో గత 19 ఏళ్లుగా నిర్వహణలు నిర్వర్తిస్తూ, విస్తరణకు సంబంధించి వ్యూహాలను, సేవలను అందిస్తూ వుంది. 
 
ఎప్పటికప్పుడు సాంకేతిక విభాగాలలో నైపుణ్యతను కలిగి నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఏఐ, మెషీన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్, ఎనలటిక్స్ తదితర సేవలను అందించడంలో తనకు తానే సాటి అని వెబ్‌దునియా నిరూపించుకుంది.
webdunia
 
అంతేకాదు... 30కి పైగా భాషల్లో ఎలాంటి అనువాదాలనైనా అవలీలగా అనువాదం చేసే సత్తాతో పాటు నిపుణులైన అనువాదకులను కలిగివుంది. అత్యుత్తమ ప్రామాణాలతో ఇన్-హౌస్ లోకలైజేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ప్రపంచ అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దుతోంది. 
 
LocWorld గురించి... గ్లోబల్ వెబ్‌సైట్ మేనేజ్‌మెంట్‌, అంతర్జాతీయ బిజినెస్, అనువాదం, లోకలైజేషన్లలో LocWorld ప్రధానమైనది. ఈ సమావేశంలో వెబ్‌దునియా అంతర్జాతీయ హెడ్ పంకజ్ జైన్‌తో పాటు గ్లోబల్ బిజినెస్, భాషా అనువాదాల సేవలు, సాంకేతిక మార్కెట్లకు సంబంధించిన సమాచారాన్ని పరస్పరం పంచుకునే మహత్తరమైన అవకాశం అనేక మందికి లభించింది.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అద్దెకు బాయ్‌ఫ్రెండ్.. ఒక్క గంటకు రూ.3 వేలు...