Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అలాంటి వాట్సాప్ గ్రూపుల్లో చిన్నారులు.. తల్లిదండ్రులు షాక్.. ఏంటది?

whatsapp

సెల్వి

, శుక్రవారం, 12 ఏప్రియల్ 2024 (13:25 IST)
స్వయం హాని, లైంగిక హింస, జాత్యహంకారాన్ని ప్రోత్సహించే హానికరమైన వాట్సాప్ గ్రూప్‌లలో తొమ్మిది సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలను జోడించడం జరిగింది. ఈ వ్యవహారం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. పాఠశాలల్లో పిల్లలతో ఉన్న వేలాది మంది తల్లిదండ్రులకు నార్తంబ్రియా పోలీసులు హెచ్చరిక పంపారు.
 
 దీనిపై వాట్సాప్ యజమాని మెటా స్పందిస్తూ.. వినియోగదారులందరికీ ఎవరికి వారు ఓ వారిని గ్రూప్‌లకు జోడించవచ్చో నియంత్రించే ఎంపికలు, తెలియని నంబర్‌లను బ్లాక్ చేయడం.. వంటి ఆప్షన్లు వున్నాయి. 
 
అయితే ఐదు లేదా ఆరేళ్ల విద్యార్థులను గ్రూపుల్లో చేర్చుతున్నట్లు పాఠశాలలు తెలిపాయి. ఇలా ఒక గ్రూపులో 40మంది చేరినట్లు కనుగొనడం జరిగింది. దీనిపై చర్యలు తీసుకుంటామని వాట్సాప్ తెలిపింది. అయినా చిన్నారులు వాట్సాప్ ఉపయోగించడంపై మెటా షాక్ అయ్యింది. 
 
ఆన్‌లైన్‌లో పిల్లల భద్రత కోసం సీనియర్ అధికారి రాణి గోవేందర్ మాట్లాడుతూ, ఆత్మహత్య లేదా స్వీయ-హానిని ప్రోత్సహించే కంటెంట్ వినాశకరమైనది. ఇప్పటికే ఉన్న మానసిక ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఇంటర్ ఫలితాలు.. షరా మూమూలే.. బాలికలదే పైచేయి..