Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కృష్ణగిరి లోక్‌సభ స్థానం బరిలో వీరప్పన్ కుమార్తె!!

vidya veerappan

వరుణ్

, సోమవారం, 25 మార్చి 2024 (12:42 IST)
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె విద్యా వీరప్పన్ పోటీ చేస్తున్నారు. సినీ దర్శకుడు సీమాన్ సారథ్యంలోని నామ్ తమిళర్ కట్చి తరపున ఆమె కృష్ణగిరి లోక్‌సభ స్థానం నుంచి బరిలో నిలిచారు. నిజానికి ఈమె గతంలో పీఎంకేలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనత పార్టీలో చేరారు. గత నాలుగేళ్లుగా ఆమె బీజేపీలో ఉంటూ వచ్చారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున టిక్కెట్ ఆశించారు. కానీ, కాషాయం పార్టీ ఆమెకు సీటు కేటాయించలేదు. అదేసమయంలో నామ్ తమిళర్ కట్చి కృష్ణగిరి లోక్‌సభ సీటును ఆమెకు కేటాయించింది. దీంతో బీజేపీకి టాటా చెప్పేసి వెంటనే సీమాన్ పార్టీలో చేరిపోయారు. 
 
నాలుగేళ్ళుగా ఆమె భారతీయ జనతా పార్టీలో ఉంటున్నారు. కానీ, ఆమెకు బీజేపీ నాయకత్వం ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో చాలా కాలంగా ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీకి రాజీనామా చేసి నామ్ తమిళర్ పార్టీలో చేరారు. కాగా, రానున్న ఎన్నికల్లో నామ్ తమిళర్ కట్చి తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలతో పాటు పుదుచ్చేరిలోన ఒక్క లోక్‌సభ స్థానం నుంచి అభ్యర్థులను బరిలోకి దించుతుంది. 
 
సినిమావాళ్లకు రాజకీయాలు ఎందుకు? పవన్‌ కళ్యాణ్‌పై ముద్రగడ సెటైర్లు 
 
ఇటీవల వైకాపాలో చేరిన కాపు పెద్దగా చెప్పుకునే ముద్రగడ పద్మనాభం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు సినిమా వాళ్లకు ఈ రాజకీయాలు ఎందుకు అని సూటిగా ప్రశ్నించారు. త్వరలోనే ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి తరహాలోనే పవన్ కళ్యాణ్ కూడా జెండా ఎత్తేస్తాడని జోస్యం చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం తథ్యమని ఆయన అన్నారు. పైగా, రానున్న ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఓటమికి కృషి చేస్తానని స్పష్టంచేశారు.
 
ఆయన ఆదివారం మాట్లాడుతూ, సినిమా వాళ్లకు రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నించారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి కొద్దికాలంలోనే జెండా ఎత్తేశారన్నారు. సినిమా వాళ్ల వ్యవహారం అంతా ఇలాగే ఉంటుందన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం పక్కా అని ముద్రగడ జోస్యం చెప్పారు. తనను చంద్రబాబు ఎంతో బాధపెట్టాడని, తన శత్రువైన చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలవడం తనకు ఏమాత్రం నచ్చలేదన్నారు. ఎన్నికల్లో పవన్, చంద్రబాబుల ఓటమికి కృషి చేస్తానని చెప్పాు. నా శత్రువుతో చేతులు కలిపిన వ్యక్తి నీతులు చెబితే నేను వినాలా? అని మండిపడ్డారు. 21 సీట్లకు సర్దుబాటు చేసుకున్న పవన్‌కు నేనెందుకు మద్దతు ఇవ్వాలని అని ముద్రగడ ప్రశ్నించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీటు ఇవ్వకుండా జగన్ అడ్డుకున్నారు... రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా? : ఆర్ఆర్ఆర్