Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహా శివుని విగ్రహం 112 అడుగులు ఎత్తు ఎందుకు..?

యోగ సంప్రదాయంలో శివుణ్ణి దైవంగా కాక ఆదియోగి లేదా మొట్టమొదటి యోగి – అంటే యోగ శాస్త్రానికి మూలపురుషునిగా చూస్తారు. మనిషికి ఇటువంటి ఆలోచన మొట్టమొదట ఈయనే కలిగించారు. “మీపైన మీరు కృషి చేసుకోగలిగితే, ఇప్పుడు మీకున్న అన్ని పరిధుల నుంచి పరిణితి చెందే అవకాశం

మహా శివుని విగ్రహం 112 అడుగులు ఎత్తు ఎందుకు..?
, శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (15:11 IST)
యోగ సంప్రదాయంలో శివుణ్ణి  దైవంగా కాక ఆదియోగి లేదా మొట్టమొదటి యోగి – అంటే యోగ శాస్త్రానికి మూలపురుషునిగా చూస్తారు. మనిషికి ఇటువంటి ఆలోచన మొట్టమొదట ఈయనే కలిగించారు. “మీపైన మీరు కృషి చేసుకోగలిగితే, ఇప్పుడు మీకున్న అన్ని పరిధుల నుంచి పరిణితి చెందే అవకాశం ఉంది” అని ఆదియోగి తెలిపారు. మనిషి తన పరిమితులకులోనై ఉండనవసరం లేదనే సంభావ్యతను ఆదియోగి మన ముందుంచారు. భౌతికతతో ముడిపడి ఉంటూనే భౌతికతకే పరిమితమైపోకుండా ఉండే మార్గం ఉంది. 
 
శరీరంలో నివశిస్తూనే, కేవలం శరీరానికే పరిమితమైపోకుండా ఉండే మార్గం ఒకటుంది. మన మనస్సును ఉన్నత స్థాయిలో ఉపయోగిస్తూనప్పటికీ, మనస్సు పెట్టే ఎటువంటి బాధలను మనం ఎరుగకుండానే జీవించవచ్చు. ప్రస్తుతం ఈ ఉనికిలో మీరు ఏ పార్శ్వంలో ఉన్నాసరే , ఆ స్థితిని మించి పరిణితి చెంది ఒక సరికొత్త మార్గంలో జీవించవచ్చు. ఈ ఆలోచన కొన్ని వేల సంవత్సరాల క్రితమే, అదియోగి నుండి మనకు తెలిసింది. ఇది, ఈ భూమ్మీద మానవ చైతన్యం వికసించటానికి ఆయన మనకందించిన సహకారం.
 
మనిషి తన పరిధులను అధిగమించి, పరమోన్నత స్థితిని చేరుకోటానికి ఆయన 112 మార్గాలను వివరించారు. ఒక వ్యక్తి జ్ఞానోదయం పొందడానికి ఉన్న అన్ని విభిన్న మార్గాలను ఆదియోగి మనకి అందించారు. మనిషి తన పరిధులను అధిగమించి, పరమోన్నత స్థితిని చేరుకోటానికి ఆయన 112 మార్గాలను వివరించారు. ఎందుకు 112 అంటే, మన శరీరంలో 112 చక్రాలు ఉంటాయి. వాస్తవానికి 114 చక్రాలు ఉన్నప్పటికీ, రెండు చక్రాలు మానవ శరీర వ్యవస్థకు వెలుపల ఉంటాయి. శరీర వ్యవస్థలో 112 చక్రాలు ఉంటాయి. అందుచేత, ఆయన ప్రతి ఒక్క చక్రాన్నీ వినియోగిస్తూ తమ పరమోన్నత స్థితికి ఎలా చేరుకోవచ్చునో చెప్తున్నారు. ఆదియోగి 112 మార్గాలనూ మాత్రమే ఉన్నాయని చెప్పి, వాటిని సప్త ఋషులకు బోధిస్తున్నప్పుడు, ఆయన భార్య పార్వతి ఇలా అంది – మీకు తెలుసు కదా, ఆవిడ ఒక స్త్రీ, అందుచేత ఆవిడకు మరింత వైవిధ్యం ఇష్టం. అందుకని ఆవిడ “112 మాత్రమే ఎందుకు, ఇంకా ఎక్కువ ఉండాలి” అని అంది.
 
ఆవిడ ఈ మాట అన్నప్పుడు, శివుడి దృష్టంతా సప్త ఋషులకు బోధించడం మీదే ఉంది. పార్వతి చెప్పినదాన్ని కొట్టిపారేస్తూ “ ఇంక ఏమీ లేవు” అన్నాడు. దానికి ఆవిడ “లేదు, నేను మరిన్ని మార్గాలను శోధిస్తాను” అని చెప్పి కఠోరమైన తపస్సులెన్నో చేసింది. ఎన్నో రకాల సాధనలు చేసి , 113వ మార్గం ఉందేమోనని శోధన చేసింది. ఇలా చాలా సంవత్సరాల శోధన తర్వాత ఆవిడా తిరిగి వచ్చింది. అప్పటికీ శివుడు సప్త ఋషులుగా పిలవబడుతున్న ఏడుగురు ఋషులకు ఇంకా బోధిస్తూనే ఉన్నాడు. 
 
ఆవిడ వచ్చింది, శివుడు ఆమె వైపు చూడనేలేదు. ఆవిడ చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది. ఆమె వస్తూనే శివుడు కూర్చుని  ఉన్న దానికి ఒక మెట్టు క్రింద కూర్చుంది. ఇది వారిద్దరి మధ్యా జరిగిన సున్నిత సంభాషణ. మామూలుగా అయితే ఆవిడ భార్య హోదాలో ఆయన ప్రక్కనే కూర్చోవచ్చు, కానీ ఆమె తన వైఫల్యాన్ని తెలియజేయటానికి ఒక మెట్టు క్రింద కూర్చుంది. అలా ఆదియోగి మానవ చైతన్యానికి అందించిన అత్యున్నత ఉపకారమే, ఇప్పుడు మనం యోగా అంటున్న అద్భుతమైన సంప్రదాయానికి మూలమయ్యింది.
 
- సద్గురు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉమామహేశ్వర స్తోత్రం...