Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

108 ఏళ్ల బామ్మకు శస్త్రచికిత్స.. అదీ అనస్థీషియా లేకుండానే.. గిన్నిస్ రికార్డు?

108 ఏళ్ల బామ్మకు శస్త్రచికిత్స.. అదీ అనస్థీషియా లేకుండానే.. గిన్నిస్ రికార్డు?
, బుధవారం, 21 అక్టోబరు 2015 (15:20 IST)
వృద్ధులకు శస్త్రచికిత్సలు చేయాలంటేనే వైద్యులు అనేక విధాలుగా ఆలోచిస్తారు. వయస్సు పైబడిన వారికి శస్త్రచికిత్సలు చేయాలంటే శక్తి లేకపోవడంతో పాటు.. వారికి ఆ సర్జరీని తట్టుకునే శక్తి ఉండదని వైద్యులు సూచిస్తారు. కానీ రాజస్థాన్ బామ్మ మాత్రం ఇందుకు విరుద్ధం. 108 ఏళ్ల వయస్సులో బ్రెయిన్ సర్జరీ చేయించుకుంది. అంతేకాకుండా అనస్థీషియా లేకుండానే ఈ బామ్మకు సర్జరీ చేయడం గమనార్హం. ఈ సర్జరీ సక్సెస్ కావడంతో గిన్నిస్ బుక్‌లో నమోదుకు పంపాలని వైద్యులు డిసైడ్ అయిపోయారు. 
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్.. కరౌలి ప్రాంతానికి చెందిన రామోలీదేవి(108) అనే బామ్మ బ్రెయిన్ హెమరేజ్‌తో బాధపడుతోంది. జయపురలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. ఈమెకు సర్జరీ చేయాలని వైద్యులు సలహా ఇచ్చారు. ఇందుకు ఆమె ఒప్పుకోవడంతో.., అనస్థీషియా ఇవ్వకుండానే ఆపరేషన్ పూర్తి చేశారు. ఆమె మెదడులో ఉన్న రెండు బ్లాక్స్ ని తొలగించి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు వైద్యులు. కాగా, గతంలో 104 ఏళ్ల మహిళకు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స జరిగిందని, దీనికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందని వైద్యులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu