Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డెడ్‌లైన్ పొడగింపు... లింకప్ చేయకపోతే...

పలు రకాల ప్రభుత్వ, ప్రైవేటు సేవలతో పాటు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్‌ నంబరు అనుసంధాన గడువును కేంద్ర ప్రభుత్వం పొడగించింది. ఈ మేరకు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియపింది.

డెడ్‌లైన్ పొడగింపు... లింకప్ చేయకపోతే...
, గురువారం, 14 డిశెంబరు 2017 (10:11 IST)
పలు రకాల ప్రభుత్వ, ప్రైవేటు సేవలతో పాటు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్‌ నంబరు అనుసంధాన గడువును కేంద్ర ప్రభుత్వం పొడగించింది. ఈ మేరకు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియపింది. ప్రభుత్వ గత ఆదేశాలను చూస్తే బ్యాంకుల్లో పాత, కొత్త ఖాతాలకు, రూ.50,000కు మించిన లావాదేవీలకు పాన్, ఆధార్‌ నంబర్‌ కోట్‌ చేయడం తప్పనిసరి. ఇందుకు ఈ యేడాది డిసెంబర్‌ 31 దాకానే గడువు. అయితే ఈ నోటిఫికేషన్‌ను కేంద్రం ఉపసహరించుకుని దీని స్థానంలో మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 
 
వచ్చే సంవత్సరం మార్చి 31లోపు ఆధార్‌ అనుసంధానం చేసుకోవచ్చునంటూ బుధవారం కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది. దీంతో బ్యాంకు ఖాతాలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ ఫోలియోలు, డీమ్యాట్, ట్రేడింగ్‌ ఖాతాలు, పాన్, పోస్టాఫీసు ఖాతాలు, బీమా పాలసీలను ఆధార్‌తో అనుసంధానం చేసుకునేందుకు, మొబైల్‌ సిమ్‌ రీవెరిఫికేషన్‌కు మరింత సమయం లభించింది. ఫలితంగా ఈ నెల 31 తర్వాత తమ ఖాతాలు బ్లాక్‌ అయిపోతాయని, ఇతరత్రా సేవలు నిలిచిపోతాయని వస్తున్న ఆందోళనలకు తెరపడింది.
 
వచ్చే యేడాది మార్చి 31వ తేదీలోపు అనుసంధానం చేయకపోతే, పాన్‌ కార్డులను ఆదాయపన్ను శాఖ రద్దు చేస్తుంది. బ్యాంకులు ఆధార్‌ నంబర్‌ సమర్పించని ఖాతాలను బ్లాక్‌ చేసేస్తాయి. దీంతో ఆయా ఖాతాదారులు అత్యవసరమైనాగానీ తమ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్‌ను వెనక్కి తీసుకోలేరు. అంటే బ్యాంకు ఖాతా లావాదేవీలు పూర్తిగా నిలిచిపోతాయి.
 
మ్యూచువల్‌ ఫండ్స్, షేర్లలో కొత్తగా పెట్టుబడులకు అవకాశం లేకుండా ఫోలియోలను, ఖాతాలను బ్లాక్‌ చేయడం జరుగుతుంది. దీంతో కొత్తగా షేర్ల కొనుగోలుకు అవకాశం ఉండదు. అప్పటికే ఉన్న షేర్లను విక్రయించేందుకు కూడా వీలు కాదు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో తాజా పెట్టుబడులకు గానీ, అప్పటికే ఉన్న పెట్టుబడులను వెనక్కి తీసుకోవటానికి గానీ అవకాశం ఉండదు. 
 
పోస్టాఫీసు పథకాల్లోనూ అంతే. ఖాతాలను నిలిపివేస్తారు. మొబైల్‌ సిమ్‌ కార్డులు మూగబోతాయి. తిరిగి ఆధార్‌ ఇచ్చిన తర్వాతే ఆయా సేవలను పొందేందుకు అవకాశం ఉంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామసేతును గౌరవించాలి : బీజేపీ ఎంపీ స్వామి