Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైలులో మహిళా కానిస్టేబుల్‌పై దాడి ... నిందితుడిపై పేలిన తూటా

encounter
, శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (19:53 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. రైలులో ప్రయాణిస్తున్న మహిళా కానిస్టేబుల్‌పై దాడి చేసిన నిందితుడిని యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. శుక్రవారం జరిగిన పోలీసు కాల్పుల్లో ఈ కేసులోని ప్రధాన నిందితుడు మృత్యువాతపడ్డాడు. 
 
ఈ ఘటన తర్వాత పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా, పోలీసుల కన్నుగప్పి పారిపోయేందుకు ప్రయ్నించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో మృతి చెందాడు. ఈ కాల్పులో మరో ఇద్దరు నిందితులు కూడా గాయపడినట్టు యూపీ పోలీసులు వెల్లడించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గత నెల 30వ తేదీన సరయూ ఎక్స్‌ప్రెస్‌లో ఓ మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. సీటు విషయంలో ఆమెతో ఓ వ్యక్తి గొడవపడ్డాడు. అది కాస్త ఘర్షణగా మారి.. నిందితుడు తన స్నేహితులతో కలిసి ఆమెను తీవ్రంగా గాయపర్చాడు. అనంతరం అయోధ్య స్టేషన్‌ రాగానే వారంతా రైలు దిగి పారిపోయారు. 
 
రైలు బోగీలో రక్తపు మడుగులో స్పృహకోల్పోయి ఉన్న ఆ మహిళా కానిస్టేబుల్‌ను రైల్వే పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి వాట్సప్‌లో వైరల్‌ అయిన వార్తలను సుమోటోగా స్వీకరించిన అలహాబాద్‌ హైకోర్టు.. యూపీ ప్రభుత్వం, రైల్వే పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను గుర్తించి, అరెస్టు చేయాలని యూపీ పోలీసులను ఆదేశించింది.
 
ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక సమాచారం ఆధారంగా ప్రధాన నిందితుడిని అనీశ్‌ ఖాన్‌గా గుర్తించారు. అతడిని అరెస్టు చేసేందుకు అయోధ్యలో సోదాలు చేపట్టారు. పోలీసులను చూసిన అనీశ్, అతడి అనుచరులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎన్‌కౌంటర్‌ జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో గాయపడిన అనీశ్‌.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో ప్రారంభమైన ఐఫోన్-15 విక్రయాలు.. క్యూ కట్టిన కస్టమర్లు