Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"వారసుడు" హీరో విజయ్ కొత్త రాజకీయ పార్టీ పేరు "తమిళగ వెట్రి కగళం"

vijay

వరుణ్

, శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (14:50 IST)
తమిళనాడు మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. అగ్రహీరో విజయ్ కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ పార్టీకి "తమిళగ వెట్రి కళగం" అని నామకరణం చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘంలో కూడా ఆయన తన పార్టీ పేరును నమోదు చేయించారు. ఈ మేరకు విజయ్ శుక్రవారం  అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాము ఏ ఒక్క రాజకీయ పార్టీకి మద్దతివ్వబోదని స్పష్టం చేశారు. 
 
'ప్రస్తుతం తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతోంది. దానిపై వ్యతిరేకంగా పోరాడేందుకే నేను రాజకీయాల్లోకి వచ్చా. అయితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయబోదు. ఏ పార్టీకి మద్దతు కూడా ఇవ్వం. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతాం' అని విజయ్ వెల్లడించారు. ఇక, పార్టీ జెండా, అజెండాను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
 
కాగా, తమిళనాట సూపర్‌స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ స్థాయి స్టార్‌డమ్ కలిగిన నటుడు విజయ్. అభిమానులంతా ముద్దుగా 'దళపతి' అని పిలుచుకుంటారు. కొంతకాలంగా సేవా కార్యక్రమాలను చురుగా చేపడుతున్నారు. చదువుల్లో ప్రతిభ చూపిన పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థుల్లో రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మొదటి స్థానాల్లో నిలిచి విద్యార్థులకు ఆయన నగదు, ఇతర ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. 
 
రజనీకాంత్ రాజకీయాల్లోకి రానని స్పష్టంచేయడంతో.. విజయ్ తన రాజకీయ ప్రవేశాన్ని వేగవంతం చేశారు. అందులోభాగంగానే విజయ్ మక్కల్ ఇయక్కం(అభిమానుల సంఘం) నిర్వాహకులతో ఇప్పటికే పలుమార్లు సమావేశమై రాజకీయ పార్టీపై సుదీర్ఘ చర్చలు జరిపారు. 'తమిళగ మున్నేట్ర ద్రావిడ కళగం' పేరుతో ఆయన పార్టీని స్థాపిస్తారని ఇటీవల ఊహాగానాలు వినిపించాయి. దీనికి స్వల్ప మార్పులు చేసిన 'తమిళగ వెట్రి కళగం' పేరును ఖరారు చేశారు.
 
కాగా, విజయ్‌కు స్టార్డమ్ రావడం వెనక తెలుగు చిత్రాల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. విజయ్ కెరీర్‌లో 'పోకిరి', 'గిల్లి', 'బద్రి', 'ఆది', 'వేలాయుధం', 'యూత్ వంటి సినిమాలు ముఖ్యమైనవి. కెరీర్‌ను మలుపుతిప్పాయి కూడా. ఇవన్నీ తెలుగు సినిమాలే కావడం విశేషం. అభిమానులకు ప్రాధాన్యం ఇస్తుంటారు. యేడాదిలో రెండుసార్లు నేరుగా సమావేశమై వారికి విందు, బహుమతులు అందిస్తూ క్షేత్రస్థాయిలో బలమైన అభిమానులను కలిగివున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హేమంత్ సొరేన్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు... హైకోర్టే దానికి సరైన వేదిక...