Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాబు స్పీచ్‌కు రాజ్‌నాథ్ బ్రేక్.. అయినా 20 నిమిషాలు వదల్లేదు.. ప్రధాని పలకరింపు..

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం వాడీవేడిగా కొనసాగింది. కేంద్ర ప్రభుత్వ తీరును, 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎండగట్టారు. అంతకుముందు సమావేశం ప్రారంభమైన తర్వాత ప

బాబు స్పీచ్‌కు రాజ్‌నాథ్ బ్రేక్.. అయినా 20 నిమిషాలు వదల్లేదు.. ప్రధాని పలకరింపు..
, ఆదివారం, 17 జూన్ 2018 (15:17 IST)
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం వాడీవేడిగా కొనసాగింది. కేంద్ర ప్రభుత్వ తీరును, 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎండగట్టారు. అంతకుముందు సమావేశం ప్రారంభమైన తర్వాత ప్రధానిని చంద్రబాబు పట్టించుకోలేదు. ఎవ్వరూ ఒకరినొకరు పలకరించుకోలేదు.


అనంతరం టీ బ్రేక్ సమయంలో నలుగురు ముఖ్యమంత్రులు చంద్రబాబు, మమతా బెనర్జీ, పినరయి విజయన్, కుమారస్వామిలు మాట్లాడుకుంటుండగా... మోదీనే వారి వద్దకు వచ్చి, పలకరించారు. ప్రస్తుతం ఈ పలకరింపుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
ఇక నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు ఏపీ సమస్యలపై కేందాన్ని నిలదీశారు. విభజన సమస్యలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఆయన గళమెత్తారు. ఏడు నిమిషాల్లోపే తన ప్రసంగాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ఆగకుండా 20 నిమిషాల పాటు తన ప్రసంగాన్ని కొనసాగించారు. 13 పేజీల నివేదికను సమావేశంలో  చదివి వినిపించారు. నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు లేవనెత్తిన డిమాండ్లను ఓసారి పరిశీలిస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. రాష్ట్ర రెవెన్యూ లోటును భర్తీ చేయాలి. విభజన హామీలన్నింటినీ అమలు చేయాలన్నారు. 
 
అలాగే జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంకు వెంటనే నిధులను మంజూరు చేయాలని, రాజధాని అమరావతి నిర్మాణానికి ఇస్తామన్న నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు రూ. 350 కోట్లు విడుదల చేయాలి. గృహ నిర్మాణం, వైద్యానికి ఎక్కువ నిధులు ఇవ్వాలి. రైతులు చెమటోడ్చి పండించుకున్న పంటకు కనీస మద్దతు ధరను ప్రకటించాలి.
 
15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోవడం సరికాదు. విధి విధానాలను మార్చండి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీలతో రాష్ట్రాలపై పెనుభారం పడిందని చంద్రబాబు గుర్తు చేశారు. అంతటితో ఆగకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు టార్గెట్ చేశారు. తమరు కూడా ముఖ్యమంత్రిగా (గుజరాత్‌కు) పనిచేశారని... మరో సీఎం పడుతున్న బాధను అర్థం చేసుకోవాలంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దాతీ మహారాజ్ ఆశ్రమంలో 600 మంది అమ్మాయిలు ఏమయ్యారు?