Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వరద నీటిలో చిక్కుకున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్.. బోగీల్లోకి నీరు (వీడియో)

హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ వరద నీటిలో చిక్కుకుంది. రైలు బోగీల్లోకి నీరు చేరింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలో ఉన్నారు. ఒడిషా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. ఎడతెరపిల

వరద నీటిలో చిక్కుకున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్.. బోగీల్లోకి నీరు (వీడియో)
, శనివారం, 21 జులై 2018 (13:07 IST)
హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ వరద నీటిలో చిక్కుకుంది. రైలు బోగీల్లోకి నీరు చేరింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలో ఉన్నారు. ఒడిషా రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెల్సిందే. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఒడిశా అతలాకుతలమైంది. రాయ్‌గఢ్‌ జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రైల్వే ట్రాక్‌లపైకి కూడా వరదనీరు వచ్చి చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
 
ముఖ్యంగా, రాయ్‌గఢ్‌ జిల్లా లక్ష్మీపురం సమీపంలోని బాలుమస్కా స్టేషన్ వద్ద భువనేశ్వర్ నుంచి జగ్దల్‌పూర్ వెళ్తున్న హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు వరద నీటిలో చిక్కుకుపోయింది. ట్రైన్ బోగీలోకి నీరు వచ్చి చేరింది. వరద నీటిలో ట్రైన్ చిక్కుకుపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. వరద ఉధృతి తగ్గాక ట్రైన్ కదిలే అవకాశం ఉంది. అలాగే మరో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ సింగిపురం టికిరి స్టేషన్ల మధ్య చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిజాయితీకి నిలువెత్తు ఆదర్శం... అశ్వరథ ఊరేగింపు...