Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతీయ జెండాకు అవమానం : నేషనల్ ఫ్లాగ్‌పై బీజేపీ జెండా...

జాతీయ జెండాకు అవమానం : నేషనల్ ఫ్లాగ్‌పై బీజేపీ జెండా...
, సోమవారం, 23 ఆగస్టు 2021 (13:10 IST)
జాతీయ జెండాకు అవమానం జరిగింది. జాతీయ జెండాపై బీజేపీ జెండాను కప్పారు. యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ భౌతిక దేహాన్ని ఉంచిన శవపేటికపై జాతీయ జెండాను ఉంచారు. దానిపై బీజేపీ జెండా ఉంచారు. దీనిపై కాంగ్రెస్ అభ్యంతరం లేవనెత్తింది. 
 
జాతీయ జెండాపై పార్టీ జెండాను ఉంచారని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సహా పలువురు నేతలు సీరియస్ అయ్యారు. జాతీయ జెండాకు అవమానం జరిగిందని ఆరోపించారు.
 
కాగా, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ మృతిపై బీజేపీ సంతాపం ప్రకటించింది. ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యానాథ్ సహా పలువురు కీలక పార్టీ నేతలు ఆయన భౌతిక దేహానికి నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం యూపీ రాజధాని లక్నోకు వెళ్లి రాష్ట్ర మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ భౌతిక దేహానికి నివాళులర్పించారు. 
 
కళ్యాణ్ సింగ్ విలువైన మానవమాత్రుడని, సమర్థుడైన నాయకుడని ప్రధాని మోడీ అన్నారు. సామాన్య ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలిచాడని తెలిపారు. ప్రధానమంత్రి మోడీ నివాళులర్పించిన తర్వాత కళ్యాణ్ సింగ్ భౌతిక దేహాన్ని ఉంచిన శవపేటికకు పలుమార్పులు జరిగినట్టు తెలుస్తున్నది.
 
కళ్యాణ్ సింగ్ భౌతికదేహం ఫొటోను బీజేపీ ట్వీట్ చేసింది. ఈ ఫొటోలో శవపేటిక సగభాగం జాతీయ జెండా బయటకు కనిపిస్తున్నది. మిగతా సగభాగంపై బీజేపీ జెండా ఉంచారు. అంటే జాతీయ పతాకంపై బీజేపీ జెండాను ఉంచారు. దీనిపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ట్విట్టర్‌లో మండిపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్రం నుంచి నిధులు రాబట్టడమెలా?... ఏపీ ప్రభుత్వం మల్లగుల్లాలు