Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆకాశంలో సూపర్ మూన్.. కారణం ఎంటో తెలుసా?

blue moon
, గురువారం, 31 ఆగస్టు 2023 (09:48 IST)
ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఒకే నెలలో రెండోసారి కనిపించే సూపర్ బ్లూమూన్ పరిణామం చోటు చేసుకుంది. ఆగస్టు నెలలో రెండు పౌర్ణమిలు వచ్చాయి. రెండో పౌర్ణమి రోజైన ఆగస్టు 30వ తేదీ బుధవారం చంద్రుడు పెద్దగా కనిపించింది. దీన్నే సూపర్ బ్లూమూన్ అంటారు. 
 
2023 ఆగస్టు నెలలో రెండు పౌర్ణమిలు వచ్చాయి. వాటిలో తొలి పౌర్ణమి ఆగస్టు ఒకటో తేదీన వచ్చింది. ఇక రెండో మూన్ బుధవారం వచ్చింది. రెండో పౌర్ణమి రోజున కనిపించే చంద్రుడినే సూపర్ బ్లూమూన్ అంటారు. 
 
ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో సమయాలకు అనుగుణంగా ఆగస్టు 30 లేదా 31 తేదీలలో చంద్రుడు బ్లూమూన్ కనిపిస్తాడు. భారతదేశంలో ఆగస్టు 30 రాత్రి 9.30 గంటలకు సూపర్ మూన్ ఆవిష్కృతమైంది. అయితే సూపర్ బ్లూమూన్ మాత్రం ఆగస్టు 31న ఉదయం ఏడు గంటలకు గరిష్టస్థాయికి చేరుతుంది.
 
పౌర్ణమి సమయంలో చందమామ భూమికి దగ్గరగా రావడాన్ని సూపర్ మూన్‌గా పేర్కొంటారు. సాధారణ పౌర్ణమి రోజుల కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చంద్రుడు సాధారణ పరిమాణం కంటే 7 శాతం పెద్దగా, 16 శాతం ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఈ తరహా బ్లూ మూన్ గతంలో 1940లో, ఆ తర్వాత 2018లో కనిపించింది. ఇప్పుడు మరలా కనిపించిన ఈ సూపర్ బ్లూమూన్ మళ్లీ 2037లో కనిపించనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాదాపూర్‌లో రేవ్ పార్టీ... పోలీసుల అదుపులో సినీ ప్రముఖులు