Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్రగ్రహణ నరబలి : భార్య ఆరోగ్యం కోసం చిన్నారిని బలిచ్చాడు

ఇటీవల సంపూర్ణ చంద్రగ్రహణం రోజున హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన నరబలి కేసులోని మిస్టరీ వీడింది. ఈ కేసులో ఇంటి యజమానే ప్రధాన నిందితుడని తేలింది. భార్య ఆరోగ్యం కోసం కరీంనగర్ జిల్లాలోని ఒక తండాకు చెందిన ఓ

చంద్రగ్రహణ నరబలి : భార్య ఆరోగ్యం కోసం చిన్నారిని బలిచ్చాడు
, మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (11:07 IST)
ఇటీవల సంపూర్ణ చంద్రగ్రహణం రోజున హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన నరబలి కేసులోని మిస్టరీ వీడింది. ఈ కేసులో ఇంటి యజమానే ప్రధాన నిందితుడని తేలింది. భార్య ఆరోగ్యం కోసం కరీంనగర్ జిల్లాలోని ఒక తండాకు చెందిన ఓ చిన్నారిని కిడ్నాప్ చేసి నరబలి ఇచ్చినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో ఈ కేసులో చిక్కుముడి వీడిపోయింది. చంద్రగ్రహణం రోజు నరబలి ఇస్తే మంచి జరుగుతుందన్న పూజారి సలహా మేరకు రాజశేఖర్‌ తన ఇంట్లో చిన్నారిని బలి ఇచ్చారు. స్థానిక ఉప్ప‌ల్‌లోని చిలుకాన‌గ‌ర్‌లో చంద్రగ్రహణం రోజున ఈ దారుణం జరిగింది. 
 
భార్య శ్రీలత ఆరోగ్యం మెరుగ పడటం కోసమే ఓ పాపను తీసుకొచ్చి బలిచ్చినట్లు సమాచారం. కరీంనగర్‌లోని ఓ తండా నుండి పాపను తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు రాజశేఖర్ వెల్లడించాడు. పూర్తి విచారణ అనంతరం అరెస్టయిన అయిదుగురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
 
ఈ నరబలికి గల కారణాలను పరిశీలిస్తే, ఉప్పల్‌ సర్కిల్‌ చిలుకానగర్‌ డివిజన్‌‌లో నివసించే రాజశేఖర్‌ (35) క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. గత గురువారం ఉదయం ఆయన అత్త బాలలక్ష్మి ఉతికిన బట్టలు ఆరేసేందుకు డాబాపైకి వెళ్లగా ఓ చిన్నారి తల కనబడటంతో వచ్చి కుటుంబీకులకు చెప్పారు. డాబాపైకి వెళ్లి చూసిన రాజశేఖర్‌ ఉప్పల్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు రాజశేఖర్ చెబుతున్న విషయాలపై అనుమానం రావడంతో అదుపులోకి విచారించగా నరబలి విషయం బయటపడింది. 
 
స్థానికంగా ఉంటున్న మెకానిక్‌ నరహరి ఇంటిలో క్షద్ర పూజలు జరిగినట్లు గుర్తించారు. ఈ కేసులో రాజశేఖర్‌తో పాటు నరహరి, అతని కుమారుడు రంజిత్‌, పూజారి, పాపను విక్రయించిన బ్రోకర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాజశేఖర్ భార్య శ్రీలత ఆరోగ్యం మెరుగు పడేందుకు గ్రహణ సమయంలో పూజలు చేసి చిన్నారిని బలిచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. చిన్నారి తల దొరికినా.. మృతదేహం (మొండెం) మాత్రం ఇంకా లభించలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పకోడీలు అమ్ముకుంటే తప్పేంటి? రాజ్యసభలో అమిత్ షా