Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో పేరుమోసిన నకిలీ బాబాలు వీరే... మొదటి స్థానం డేరా బాబాదే

దేశంలో తమను తాము దైవాశం సంభూలుగా, దైవ దూతలుగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్న నకిలీ బాబాల జాబితా ఒకటి బహిర్గతమైంది. ఇందులో మొత్తం 14 మంది ఉన్నారు. ఈ జాబితాను హిందూ సాధువుల అత్యున్నత సంస్థ అఖిల భారతీయ

దేశంలో పేరుమోసిన నకిలీ బాబాలు వీరే... మొదటి స్థానం డేరా బాబాదే
, సోమవారం, 11 సెప్టెంబరు 2017 (12:46 IST)
దేశంలో తమను తాము దైవాశం సంభూలుగా, దైవ దూతలుగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్న నకిలీ బాబాల జాబితా ఒకటి బహిర్గతమైంది. ఇందులో మొత్తం 14 మంది ఉన్నారు. ఈ జాబితాను హిందూ సాధువుల అత్యున్నత సంస్థ అఖిల భారతీయ అఖాడా పరిషత్ విడుదల చేసింది.
 
ఈ జాబితాలో రాథేమా, అసిమానంద, ఓంబాబా తదితర 14 మంది దేవుడి పేరుతో హిందూ మతానికి మచ్చ తెస్తున్నారని పేర్కొంది. అలహాబాద్‌లో ఆదివారం జరిగిన అఖాడా పరిషత్ సమావేశంలో 300మందికి పైగా సాధువులు పాల్గొన్నారు. నకిలీ బాబాల మాయమాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ మేరకు 14మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేశారు. 
 
ఇటీవలే ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో 20 యేళ్ళ జైలుశిక్ష పడిన డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాంరహీంసింగ్ అలియాస్ డేరా బాబా, గృహహింస, బెదిరింపుల వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాథేమా, లైంగికదాడి ఆరోపణలపై ప్రస్తుతం జైలులో ఉన్న ఆసారాం బాపు, అవే ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్‌పై బయటకు వచ్చిన ఆసారాం తనయుడు నారాయణ సాయి, హింసను ప్రేరేపించిన కేసులో ప్రస్తుతం కటకటాల వెనుక ఉన్న రాంపాల్, వీరితోపాటు నిర్మల్ బాబా, ఓం బాబా, సచినంద్ గిరి అలియాస్ సచిన్ దత్తా, ఇచ్ఛాధారి భీమానంద్, మల్ఖాన్‌సింగ్, ఆచార్య ఖుష్‌ముని, స్వామి అసిమానంద్, బృహస్పతి గిరి, ఓం నమశ్శివాయ బాబా పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి 125 యేళ్లు.. మోడీ ఏమన్నారంటే...